దిల్లీ మళ్లీ..
దిల్లీ మళ్లీ మెరిసింది. మరోసారి ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ లానింగ్ రెచ్చిపోవడంతో దిల్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో 200పై స్కోరు సాధించింది.
వరుసగా రెండో విజయం
చెలరేగిన లానింగ్, జొనాసెన్
యూపీ వారియర్స్ ఓటమి
దిల్లీ మళ్లీ మెరిసింది. మరోసారి ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ లానింగ్ రెచ్చిపోవడంతో దిల్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో 200పై స్కోరు సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీని మట్టికరిపించిన ఆ జట్టు.. ఈసారి యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. దిల్లీ జట్టులో జెస్ జొనాసెన్ బంతితో, బ్యాటుతో అదరగొట్టింది. టోర్నీలో యూపీకి ఇదే తొలి ఓటమి.
ముంబయి
డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో విజయం. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది.లానింగ్ (70; 42 బంతుల్లో 10×4, 3×6), జెస్ జొనాసెన్ (42 నాటౌట్; 20 బంతుల్లో 3×4, 3×6) మెరవడంతో మొదట దిల్లీ 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. జెమీమా (34 నాటౌట్; 22 బంతుల్లో 4×4) రాణించింది. ఛేదనలో తడబడ్డ యూపీ.. ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. జెస్ జొనాసెన్ (3/43) విజృంభించడంతో 5 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. తాలియా మెక్‌గ్రాత్ (90 నాటౌట్; 50 బంతుల్లో 11×4, 4×6) టాప్ స్కోరర్.
యూపీ తడబాటు: భారీ లక్ష్య ఛేదనలో బలమైన ఆరంభం అవసరంగా కాగా.. యూపీ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. 3.2 ఓవర్లలో 29/0తో బాగానే ఉన్నట్లు కనిపించినా రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 31/3తో నిలిచింది. జెస్ జొనాసెన్ ఈసారి బంతితో యూపీని దెబ్బతీసింది. ఆమె నాలుగో ఓవర్లో అలీసా హీలీ (24), కిరణ్ నవ్‌గిరె (1)ను ఔట్ చేయగా.. తర్వాతి ఓవర్లోనే సెహ్రావత్ (1)ను కాప్ వెనక్కి పంపింది. తాలియా, దీప్తి (12; 20 బంతుల్లో 1×4) వెంటనే వికెట్ పడనివ్వలేదు. కానీ పరుగులు వేగంగా రాలేదు. ముఖ్యంగా దీప్తిలో దూకుడు కొరవడింది. 10 ఓవర్లలో 71/3తో యూపీ బాగా వెనుకబడి పోయింది. తర్వాతి ఓవర్లో దీప్తి ఔటైనా.. దేవిక వైద్య (23)తో కలిసి తాలియా ఇన్నింగ్స్ కొనసాగించింది. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. బ్యాటర్లిద్దరూ అవసరమైనంత వేగంగా ఆడకపోవడంతో స్కోరు బోర్డు ఏమాత్రం ఊపందుకోలేదు. యూపీ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనపడలేదు. సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరుగుతూ పోయింది. 16 ఓవర్లలో స్కోరు 113/4. చివరి నాలుగు ఓవర్లలో 99 పరుగులు చేయాల్సిన స్థితిలో యూపీ పరాజయం ఖరారైంది. మిగతా ఆట లాంఛనమే. ఆఖర్లో తాలియా విధ్వంసం సృష్టించినా.. ఆమె ఆట యూపీ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగిందంతే.
దిల్లీ ధనాధన్: అంతకుముందు కెప్టెన్ లానింగ్ దిల్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించింది. విధ్వంసక బ్యాటింగ్‌తో ఆమె ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేస్తే.. ఆఖర్లో మెరుపులతో జెస్ జొనాసెన్ జట్టు స్కోరును 200 దాటించింది. టాస్ గెలిచిన యూపీ.. ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరిస్తుందన్న ఉద్దేశంతో ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. కానీ ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్‌ను దిల్లీ సమర్థంగా ఎదుర్కొంది. చెలరేగి ఆడిన లానింగ్, ఆమె ఓపెనింగ్ భాగస్వామి షెఫాలి (17; 14 బంతుల్లో 1×4, 1×6) మొదటి వికెట్‌కు 39 బంతుల్లో 67 పరుగులు జోడించారు. లానింగ్ కట్, పుల్ షాట్లతో అలరించింది. షబ్నిమ్ వేసిన వేరు వేరు ఓవర్లలో రెండు సిక్స్‌లు.. రాజేశ్వరి ఓవర్లో మూడు బౌండరీలు బాదింది. ఆరో ఓవర్లో షెఫాలి నిష్క్రమించినా లానింగ్ జోరు కొనసాగించింది. సోఫీ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధశతకం (32 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆమె.. ఇంకొన్ని చక్కని షాట్లు ఆడింది. చివరికి 12వ ఓవర్లో నిష్క్రమించింది. అప్పటికి స్కోరు 112. అంతకుముందు ఓవర్లోనే కాప్ (16) వెనుదిరిగింది. క్యాప్సీ (21; 10 బంతుల్లో 1×4, 2×6) కాసేపు ధాటిగా ఆడి ఔటైంది. ఆఖర్లో జెస్ జొనాసెన్ రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆమె ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో ఆఖరి 5 ఓవర్లలో దిల్లీ 65 పరుగులు రాబట్టింది. 19వ ఓవర్లో తాలియా 19 పరుగులు ఇచ్చింది. జెస్‌కు జెమీమా అండగా నిలిచింది. జెస్-జెమీమా జంట అభేద్యమైన అయిదో వికెట్‌కు 67 పరుగులు జోడించింది.
దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షెఫాలి వర్మ (సి) నవ్‌గిరె (బి) తాలియా 17; మరిజేన్ కాప్ (సి) దీప్తి (బి) సోఫీ 16; జెమీమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) సోఫీ (బి) షబ్నిమ్ 21; జెస్ జొనాసెన్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211; వికెట్ల పతనం: 1-67, 2-96, 3-112, 4-144; బౌలింగ్: షబ్నిమ్ 4-0-29-1; అంజలి శ్రావణి 3-0-31-0; రాజేశ్వరి గైక్వాడ్ 2-0-31-1; తాలియా 3-0-37-1; దీప్తి శర్మ 4-0-40-0; సోఫీ ఎకిల్‌స్టోన్ 4-0-41-1
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) రాధ (బి) జొనాసెన్ 24; శ్వేత సెహ్రావత్ (సి) తానియా (బి) కాప్ 1; కిరణ్ నవ్‌గిరె (సి) క్యాప్సీ (బి) జొనాసెన్ 2; తాలియా నాటౌట్ 90; దీప్తి శర్మ (సి) రాధ (బి) శిఖా పాండే 12; దేవిక వైద్య (సి) రాధ (బి) జొనాసెన్ 23; సిమ్రన్ షేక్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169; వికెట్ల పతనం: 1-29, 2-31, 3-31, 4-71, 5-120; బౌలింగ్: మరిజేన్ కాప్ 4-1-29-1; శిఖా పాండే 4-0-18-1; జెస్ జొనాసెన్ 4-0-43-3; తారా నోరిస్ 2-0-25-0; అలీస్ క్యాప్సీ 4-0-25-0; రాధ యాదవ్ 1-0-11-0; అరుంధతి రెడ్డి 1-0-14-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Jaishankar: విదేశాల్లో భారత్‌ను విమర్శించడం.. రాహుల్ గాంధీకి అలవాటే!
-
Movies News
Chiranjeevi: ‘భోళా శంకర్’ నుంచి మరో లీక్.. ఫ్యాన్స్‌తో షేర్ చేసిన చిరు
-
General News
GPS: జీపీఎస్ మార్గదర్శకాలు వెల్లడించాలి: సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్
-
Politics News
TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
-
Crime News
Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!
-
General News
Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు