IND Vs AUS: మనోళ్లు ఆ టెక్నిక్ వాడితే..: సునీల్ గావస్కర్ కీలక సూచనలు
అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టులో ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు భారత బ్యాటర్లు బ్యాట్ హ్యాండిల్‌ను కొద్దిగా చివర్లో పట్టుకుని ఇంకాస్త వంగి ఆడాలని సూచించాడు.
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టులో ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు భారత బ్యాటర్లు బ్యాట్ హ్యాండిల్‌ను కొద్దిగా చివర్లో పట్టుకుని ఇంకాస్త వంగి ఆడాలని సూచించాడు. ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులో బంతి గిర్రున తిరగడంతో భారత బ్యాటర్లు ఆసీస్ స్పిన్నర్లకు తలవంచిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. 1987లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై బెంగళూరులో తానాడిన ఇన్నింగ్స్‌ను ఈ సందర్భంగా ఉదహరించాడు.
‘‘స్పిన్ పిచ్‌లపై బంతిని ఎదుర్కొనేటప్పుడు బ్యాట్‌ను పట్టుకునే తీరు చాలా ముఖ్యం. హ్యాండిల్‌ను కాస్త పైన పట్టుకోవాలి. దీని వల్ల టాప్ హ్యాండ్‌తో బ్యాట్‌ను సులభంగా తిప్పొచ్చు.. బాటమ్ హాండ్‌తో వేగంగా షాట్లు ఆడొచ్చు. అంతేకాదు అనుకున్న సమయంలో బ్యాట్‌ను కిందకు దింపే అవకాశం ఉంటుంది. ప్యాడ్లకు అడ్డంగా షాట్లు ఆడొచ్చు. స్పిన్ పిచ్‌లపై బంతిని ఎదుర్కోవాలంటే కొంచెం వంగి బ్యాటింగ్ చేయాలి. అప్పుడు ఇంకాస్త దగ్గరగా బంతి లైన్‌ను చూడొచ్చు. ముందుకు ఎంత దూరం వెళ్లాలో లేదా బ్యాక్‌ఫుట్‌లో ఆడాలో అనేది కూడా నిర్ణయించుకోవచ్చు.
1987లో పాకిస్థాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్టులో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నా. బంతి ఏమాత్రం బ్యాట్‌ను తాకినా పట్టేయడానికి సిల్లీ పాయింట్‌లో జావెద్ మియాందాద్ సిద్ధంగా ఉండేవాడు. ఇలాంటి స్థితిలో సాధారణ గ్రిప్ కంటే కొంచెం పైన బ్యాట్‌ను పట్టుకోవడం వల్ల పరుగులు సాధించగలిగా. బ్యాక్‌ఫుట్‌లో బంతిని డిఫెండ్ చేయడానికి కూడా ఈ టెక్నిక్ పనికొచ్చింది’’ అని సన్నీ గుర్తు చేసుకున్నాడు. పాక్‌తో 1987 టెస్టులో గావస్కర్ (96; 264 బంతుల్లో) చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
చంద్రబాబు గొప్ప నాయకుడు.. భాజపా పెద్దల్ని ఎందుకు కలిశారో ఆయన్నే అడగండి: సోము వీర్రాజు
-
Sports News
WTC Final: భారత్ ఈ రోజు పుంజుకోకుంటే..
-
Crime News
Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా