IND Vs AUS: నాలుగో టెస్టుకు మోదీ.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్‌ వీక్షణ

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో గురువారం నుంచి ఆరంభమయ్యే ఆఖరిదైన నాలుగో టెస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.

Updated : 08 Mar 2023 17:25 IST

అహ్మదాబాద్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో ఆరంభమయ్యే ఆఖరిదైన నాలుగో టెస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌తో కలిసి ఆయన మ్యాచ్‌ను వీక్షించబోతున్నారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం 1,32,000. కానీ ఒక మ్యాచ్‌కు హాజరైన అభిమానుల లెక్కల్లో మెల్‌బోర్న్‌ స్టేడియం (1,00,024)ది ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. నాలుగో టెస్టులో అహ్మదాబాద్‌ మైదానం కనీసం 95 శాతం నిండినా.. మెల్‌బోర్న్‌ రికార్డు బద్దలు కావడం ఖాయం. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టులను భారత్‌ నెగ్గగా.. మూడో టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని