ఈ ఛాంపియన్‌ మళ్లీ వస్తాడు

ఛాంపియన్‌ రిషబ్‌ పంత్‌ త్వరలోనే వస్తాడని భారత క్రికెట్‌ మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకుంటున్న పంత్‌ను శుక్రవారం యువీ కలిశాడు.

Published : 18 Mar 2023 02:13 IST

దిల్లీ: ఛాంపియన్‌ రిషబ్‌ పంత్‌ త్వరలోనే వస్తాడని భారత క్రికెట్‌ మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకుంటున్న పంత్‌ను శుక్రవారం యువీ కలిశాడు. అతడితో కలిసి ఉన్న ఒక ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘‘పసిబిడ్డలా పంత్‌ ఇప్పుడిప్పుడే నడక మొదలుపెట్టాడు. ఛాంపియన్‌ మళ్లీ వస్తాడు. అతడిని కలవడం చాలా సంతోషంగా ఉంది. రిషబ్‌ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటాడు. సరదా మనిషి. త్వరగా కోలుకోవాలి’’ అని యువీ ట్వీట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు