సత్య నాదెళ్లతో చేతులు కలిపిన దిల్లీ క్యాపిటల్స్‌

అమెరికా టీ20 టోర్నీ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో సియాటల్‌ ఫ్రాంచైజీ నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో దిల్లీ క్యాపిటల్స్‌ చేతులు కలిపింది.

Updated : 18 Mar 2023 04:25 IST

అమెరికాలో టీ20 లీగ్‌

దిల్లీ: అమెరికా టీ20 టోర్నీ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో సియాటల్‌ ఫ్రాంచైజీ నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో దిల్లీ క్యాపిటల్స్‌ చేతులు కలిపింది. ఈ జట్టుకు సియాటల్‌ ఆర్కాస్‌ అని పేరుపెట్టారు. సియాటల్‌ పరిసర సముద్రంలో కనిపించే ప్రమాదకర తిమింగళం పేరు ఆర్కాస్‌. ఇక జులైలో ఈ లీగ్‌ ప్రారంభంకానుంది. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా కొత్త లీగ్‌తో కలిసి పని చేస్తున్నాయి. జట్టును నిర్మించడం.. నిర్వహించడంలో సియాటల్‌ ఆర్కాస్‌లో జీఎంఆర్‌ గ్రూపు భాగస్వామిగా ఉంటుందని ఎంఎల్‌సీ ప్రకటించింది. సియాటల్‌ గ్రూపులో సత్యతో పాటు పలువురు ప్రముఖులు పెట్టుబడి పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు