అఫ్గాన్‌ అమ్మాయిల కోసం జర్మనీలో ఆశ్రయం పొందుతున్న బాక్సర్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అఫ్గానిస్థాన్‌ తరపున బరిలో నిలిచిన ఏకైక అమ్మాయి సాదియా బ్రోమాండ్‌. 2021లో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక క్రీడల్లో పాల్గొనకుండా అక్కడి అమ్మాయిలపై నిషేధం విధించారు కదా.. మరి సాదియా ఎలా ఆడుతుందనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమె జర్మనీలో ఆశ్రయం పొందుతుండడమే అందుకు కారణం.

Updated : 19 Mar 2023 03:43 IST

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అఫ్గానిస్థాన్‌ తరపున బరిలో నిలిచిన ఏకైక అమ్మాయి సాదియా బ్రోమాండ్‌. 2021లో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక క్రీడల్లో పాల్గొనకుండా అక్కడి అమ్మాయిలపై నిషేధం విధించారు కదా.. మరి సాదియా ఎలా ఆడుతుందనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమె జర్మనీలో ఆశ్రయం పొందుతుండడమే అందుకు కారణం. మూడేళ్ల క్రితమే ఆమె బెర్లిన్‌కు తరలివెళ్లింది. ఇప్పుడు మాతృదేశం అఫ్గాన్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె.. తమ దేశంలోని అమ్మాయిల కోసం ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవాలనుకుంటోంది. ‘‘ఫైనల్‌ చేరడంతో పాటు పసిడి కొట్టడమే లక్ష్యం. ఈ పోరాటం కేవలం నా కోసమే కాదు. స్వదేశంలోని అఫ్గాని అమ్మాయిలందరి కోసం. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అమ్మాయిల హక్కులు కాలరాశారు. ఉన్నత విద్య చదువుకునే అవకాశం లేదు. క్రీడల్లో పోటీపడే ఆస్కారం లేదు. నేను స్వదేశం విడిచి పెట్టడానికి తాలిబన్ల పాలన ఓ కారణం.  నేను అఫ్గాన్‌ జాతీయ బాక్సింగ్‌ బృందంలో చేరాక చాలా మంది అమ్మాయిలు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అక్కడ అందరూ సాధన ఆపేశారు. నేనూ అఫ్గాన్‌లోనే ఉంటే పోటీల్లో పాల్గొనే అవకాశముండేది కాదు’’ అని సాదియా పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు