విలియమ్సన్‌, నికోల్స్‌ ద్విశతకాలు

శ్రీలంకతో ఇప్పటికే తొలి టెస్టును గెలుచుకున్న న్యూజిలాండ్‌.. రెండో టెస్టులోనూ బలంగా ముందుకెళ్తోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (215; 296 బంతుల్లో 23×4, 2×6), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌; 240 బంతుల్లో 15×4, 4×6) ద్విశతకాలతో కదం తొక్కడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది.

Published : 19 Mar 2023 02:15 IST

కివీస్‌ 580/4 డిక్లేర్డ్‌
లంకతో రెండో టెస్టు

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో ఇప్పటికే తొలి టెస్టును గెలుచుకున్న న్యూజిలాండ్‌.. రెండో టెస్టులోనూ బలంగా ముందుకెళ్తోంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (215; 296 బంతుల్లో 23×4, 2×6), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌; 240 బంతుల్లో 15×4, 4×6) ద్విశతకాలతో కదం తొక్కడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 580/4 వద్ద డిక్లేర్‌ చేసింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 26/2తో నిలిచింది. ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 155/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ను విలియమ్సన్‌, నికోల్స్‌ నడిపించారు. ఈ క్రమంలో 171 బంతుల్లో సెంచరీ అందుకున్న విలియమ్సన్‌.. టీ తర్వాత 285 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 173 బంతుల్లో శతకం సాధించిన నికోల్స్‌.. మరో 67 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ అందుకోవడం విశేషం. నికోల్స్‌ ద్విశతకం పూర్తయిన కాసేపటికే కివీస్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మూడో వికెట్‌కు కేన్‌-నికోల్స్‌ 363 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్‌కు టెస్టుల్లో ఇది ఆరో ద్విశతకం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని