సత్తా మేరకు ఆడలేదు: రోహిత్‌

ఆస్ట్రేలియా పేసర్‌ స్టార్క్‌ బలానికి పడిపోయామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘‘స్టార్క్‌ నాణ్యమైన బౌలర్‌.

Published : 20 Mar 2023 02:00 IST

విశాఖపట్నం: ఆస్ట్రేలియా పేసర్‌ స్టార్క్‌ బలానికి పడిపోయామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘‘స్టార్క్‌ నాణ్యమైన బౌలర్‌. కొత్త బంతితో కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాకు వికెట్లు అందిస్తున్నాడు. తన బలాన్ని ఉపయోగించి బంతులేశాడు. మేం అతని బలానికి పడిపోయాం. అది అర్థం చేసుకుని, అందుకు తగినట్లు ఆడడంపై దృష్టి పెట్టాలి. బ్యాటింగ్‌ ప్రదర్శన పూర్తిగా నిరాశపర్చింది. మా సత్తామేరకు ఆడలేకపోయాం. ఆ పరుగులు సరిపోవని తెలుసు. ఇది 117 పరుగులు చేసే పిచ్‌ ఏ మాత్రం కాదు. మేం మా ఆటతీరు ప్రదర్శించలేకపోయాం. శ్రేయస్‌ కోలుకుని ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలీదు. ఆ స్థానంలో సూర్యను ఆడిస్తున్నాం. అతని సామర్థ్యం అందరికీ తెలిసిందే. అలాంటి ఆటగాడికి అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రాణించాలని సూర్యకు తెలుసు. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల్లో, అంతకంటే ముందు వన్డేల్లో అతను ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతనికి మ్యాచ్‌లాడే అవకాశమిస్తాం. ఒకవేళ అప్పటికీ కుదురుకోకపోతే ఆలోచిస్తాం. బుమ్రా లేకుండా ఆడడం జట్టుకు అలవాటవుతోంది. అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే’’ అని రోహిత్‌ చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు