ఆర్సీబీ అందుకే టైటిల్ గెలవలేదు: క్రిస్ గేల్
ఐపీఎల్‌లో అందరి దృష్టి తనతో పాటు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండేదని.. దీంతో మిగిలిన ఆటగాళ్లు జట్టులో భాగం కానట్లు ఆడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేకపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు.
దిల్లీ: ఐపీఎల్‌లో అందరి దృష్టి తనతో పాటు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండేదని.. దీంతో మిగిలిన ఆటగాళ్లు జట్టులో భాగం కానట్లు ఆడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేకపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ‘‘జట్టులో కీలక ఆటగాడిగా ఉండడం ఎప్పుడూ ఆనందమే. కానీ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు ఇంకో విషయం అర్థం అయింది. నాతో పాటు కోహ్లి, డివిలియర్స్‌పైనే అందరి దృష్టి ఉండేది. దీని వల్ల మిగిలిన ఆటగాళ్లలో ఎక్కువమంది తమకు ఈ జట్టుతో సంబంధం లేనట్లు ఉండేవాళ్లు. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ జట్టుకైనా టైటిల్ గెలవడం పెద్ద సవాల్’’ అని గేల్ పేర్కొన్నాడు. మరోవైపు గేల్, డివిలియర్స్ ధరించిన 333, 17 జెర్సీలను వారికి గౌరవంగా రిటైర్ చేస్తున్నట్లు ఆర్సీబీ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇద్దరు దిగ్గజాలను బెంగళూరు తమ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చింది. 2021 సీజన్ తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో గత సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా ఆర్సీబీ కప్ గెలవలేకపోయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala Ghat Road: వాహనాలను నియంత్రించకుంటే నష్టమే.. తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు
-
Sports News
MS Dhoni: ధోని.. మోకాలి గాయాన్ని బట్టే తుదినిర్ణయం: సీఎస్కే సీఈవో విశ్వనాథన్
-
Crime News
Khammam: లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
Crime News
Gang rape: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. కాలిన గాయాలతో మృతి
-
Sports News
Virat Kohli: కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..