ఫాలోఆన్‌లో లంక

శ్రీలంకతో తొలి టెస్టులో గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌.. క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. రెండో టెస్టులోనూ ఆ జట్టు పట్టు బిగించింది.

Published : 20 Mar 2023 02:04 IST

ప్రస్తుతం 113/2

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో తొలి టెస్టులో గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌.. క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. రెండో టెస్టులోనూ ఆ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో లంకను 164కే కుప్పకూల్చిన కివీస్‌.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడిస్తోంది. మూడో రోజు ఆట చివరికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 113/2తో నిలిచింది. కుశాల్‌ మెండిస్‌ (50), ఏంజెలో మాథ్యూస్‌ (1) క్రీజులో ఉన్నారు. దిముత్‌ కరుణరత్నే (51) అర్ధసెంచరీ చేసి ఔటయ్యాడు. ఇంకా ఆ జట్టు 303 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 26/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. ఒక దశలో 114/4తో మెరుగ్గానే కనిపించింది. కానీ మాట్‌ హెన్రీ (3/44), మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (3/50) ధాటికి 50 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి రెండొందల్లోపే ఆలౌటైంది. దిముత్‌ (89; 188 బంతుల్లో 9×4), చండిమాల్‌ (37; 92 బంతుల్లో 4×4) పోరాడకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేదే కాదు. తొలి ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ 580/4 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు