సత్తాచాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు

వివిధ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ల పతక వేట కొనసాగుతోంది.

Published : 20 Mar 2023 02:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ల పతక వేట కొనసాగుతోంది. తాజాగా జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ‘లక్ష్య’ అథ్లెట్లు రమణయ్య, రెడ్డి నారాయణ రావు పతకాలతో మెరిశారు. పుణెలో జరిగిన పురుషుల టీ13 విభాగం 400 మీటర్ల పరుగులో శ్రీకాకుళానికి చెందిన రమణయ్య రజతం గెలిచాడు. కోచ్‌ రామారావు శిక్షణలో అతను సాధన కొనసాగిస్తున్నాడు. టీ44 పురుషుల 100 మీటర్ల పరుగులో నారాయణ రావు కాంస్యం నెగ్గాడు. కోచ్‌ సతీష్‌ దగ్గర ఈ విజయనగర అథ్లెట్‌ శిక్షణ పొందుతున్నాడు. మరోవైపు ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగు స్ప్రింట్‌ ఛాంపియన్‌షిప్‌లో ‘లక్ష్య’ అథ్లెట్లు అదరగొట్టారు. మహిళల 100మీ. పరుగులో క్లీన్‌స్వీప్‌ చేశారు. అగసర నందిని (11.80సె) స్వర్ణం, రజిత కుంజ (11.99సె) రజతం, ప్రత్యూష (12.10సె) కాంస్యం సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా వరుసగా రూ.25,000, రూ.12,500, రూ.7,000 నగదు బహుమతి కూడా దక్కించుకున్నారు. అండర్‌-8 బాలికల 60మీ. పరుగులో పి.పార్వతి పసిడి, ఎం.పార్వతి కాంస్యం గెలిచారు. అండర్‌-10 బాలుర 80మీ. పరుగులో అభినవ్‌ రెడ్డి కంచు పతకం నెగ్గాడు. అండర్‌-8 బాలుర 60మీ. పరుగులో నురైన్‌ రజతం, తారిష్‌ కాంస్యం, అండర్‌-12.. బాలికల 80మీ. పరుగులో సమీర రజతం, బాలుర 80మీ. పరుగులో జితేందర్‌ కాంస్యం అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు