ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్
తనను జట్టులోంచి ఎందుకు తీసేశారని అడిగినందుకు మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంఛైజీ గుజరాత్ జెయింట్స్ చిత్రమైన సమాధానం చెప్పిందని వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్ తెలిపింది.
దిల్లీ: తనను జట్టులోంచి ఎందుకు తీసేశారని అడిగినందుకు మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంఛైజీ గుజరాత్ జెయింట్స్ చిత్రమైన సమాధానం చెప్పిందని వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్ తెలిపింది. వేలంలో రూ.60 లక్షలు పెట్టి డాటిన్‌ను దక్కించుకున్న గుజరాత్.. వైద్య కారణాల పేరిట టోర్నీ ఆరంభంలో జట్టు నుంచి ఆమెను తప్పించింది. ఈ పరిణామంపై సామాజిక మాధ్యమంలో విండీస్ బ్యాటర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘డబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు జెయింట్స్ నన్ను తీసేయడం చాలా నిరాశ కలిగించింది. ఎందుకు తప్పించారంటే వాళ్లు చెప్పిన కారణం.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నానట. ఇదే అర్థం కాలేదు. పొత్తి కడుపులో నొప్పితో కొంచెం ఇబ్బందిపడ్డాను. జనవరిలో నిపుణులను సంప్రదించా. ఫిబ్రవరి 13 వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫిబ్రవరి 14 నుంచి క్రికెట్ ఆడొచ్చని లిఖిత పూర్వకంగా ధ్రువీకరించారు. ఆ తర్వాత శిక్షణ కొనసాగించా. శిక్షణలో కాస్త నొప్పిగా అనిపించడంతో కొన్ని రోజులు విశ్రాంతి కావాలని ఫ్రాంఛైజీకి చెప్పా. కానీ నా మాటలను ఇంకోలా అర్థం చేసుకున్నారు. మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు ఫిబ్రవరి 20న ధ్రువీకరణ పత్రం వచ్చింది. దీన్ని గుజరాత్ జట్టుకు కూడా పంపా. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది’’ అని డాటిన్ వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్