గుజరాత్‌ను కొట్టి.. ప్లేఆఫ్స్‌కు యూపీ
ఉత్కంఠ ముగిసింది.. నాటకీయతకు తెరపడింది. ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా యూపీ వారియర్స్ ముందంజ వేసింది.
జెయింట్స్‌పై విజయం
చెలరేగిన హారిస్, తాలియా
ఆర్సీబీ కూడా ఔట్
ఉత్కంఠ ముగిసింది.. నాటకీయతకు తెరపడింది. ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా యూపీ వారియర్స్ ముందంజ వేసింది. మహిళల ప్రిమియర్ లీగ్ ఆరంభ సీజన్‌లో చివరి ప్లేఆఫ్స్ బెర్తును పట్టేసింది. గుజరాత్ జెయింట్స్‌పై విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నేరుగా నాకౌట్లో అడుగుపెట్టింది. 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. యూపీ గెలుపుతో.. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్, బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించనున్నాయి.
ముంబయి
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టుగా యూపీ వారియర్స్ నిలిచింది. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచిన గుజరాత్ మొదట 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. హేమలత (57; 33 బంతుల్లో 6×4, 3×6), ఆష్లీ గార్డ్‌నర్ (60; 39 బంతుల్లో 6×4, 3×6) సత్తాచాటారు. యూపీ బౌలర్లలో 16 ఏళ్ల పర్శవి చోప్రా (2/29), రాజేశ్వరి (2/39) ఆకట్టుకున్నారు. ఛేదనలో యూపీ 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (72; 41 బంతుల్లో 7×4, 4×6), తాలియా మెక్‌గ్రాత్ (57; 38 బంతుల్లో 11×4) నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కిమ్ గార్త్ (2/29) రాణించింది.
ఈ ఇద్దరు చెలరేగి..: ఛేదన ఆరంభంలో తడబడ్డ యూపీ.. గుజరాత్‌లాగే మూడు వికెట్లు త్వరగా కోల్పోయింది. 5 ఓవర్లకు 39/3తో కష్టాల్లో పడింది. కానీ ఓ ఎండ్‌లో బౌండరీల వేటలో సాగుతున్న తాలియాకు హారిస్ తోడవడంతో ఆ జట్టు కోలుకుంది. కవర్‌డ్రైవ్‌లు, స్లాగ్‌స్వీప్ షాట్లతో తాలియా.. కట్ షాట్లు, లాఫ్టెడ్ సిక్సర్లతో హారిస్ చెలరేగారు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగానే ఉన్నా.. ఎక్కడా ఇన్నింగ్స్ వేగం తగ్గకుండా చూశారు. హర్లీన్ వేసిన 12వ ఓవర్లో హారిస్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టింది. అర్ధశతకం తర్వాత తాలియా, ఆ వెంటనే దీప్తి (6)ని ఔట్ చేసిన గుజరాత్ తిరిగి పోటీలోకి వచ్చేలా కనిపించింది. యూపీ విజయానికి చివరి అయిదు ఓవర్లలో 49 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న హారిస్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బౌండరీలు రాబట్టింది. తనూజ వేసిన 17వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టింది. ఆ తర్వాత గార్డ్‌నర్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ సాధించింది. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 19వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ ఓ ఫోర్, హారిస్ ఓ సిక్సర్ బాదారు. కానీ తర్వాతి బంతికే హారిస్ పెవిలియన్ చేరింది. అయినా చివరి ఓవర్లో 7 పరుగులే అవసరమవడంతో యూపీ భరోసాతో ఉంది. కానీ చివరి ఓవర్లో కాస్త నాటకీయత నెలకొంది. తొలి మూడు బంతులకు నాలుగు పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి ఓ పరుగు రావడంతో పాటు సిమ్రన్ (1) రనౌటైంది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరం కాగా.. ఆఫ్‌స్టంప్ బయటకు జరిగిన ఎకిల్‌స్టోన్ (19 నాటౌట్) బంతిని ఫైన్‌లెగ్ దిశగా బౌండరీకి తరలించి జట్టును గెలిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో తాలియా క్యాచ్‌ను, చివర్లో ఎకిల్‌స్టోన్ క్యాచ్‌ను పట్టలేకపోయిన గుజరాత్ మూల్యం చెల్లించుకుంది.
నిలిచిన హేమలత, గార్డ్‌నర్: 50/3.. పవర్‌ప్లేలో గుజరాత్ స్కోరిది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (23), లారా వోల్వార్ట్ (17) వేగంగా ఆడడంతో 4 ఓవర్లలోనే స్కోరు 40 దాటింది. కానీ పుంజుకున్న యూపీ బౌలర్లు రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. మంచి ఫామ్‌లో ఉన్న లారాను ఏపీ పేసర్ అంజలి (1/21) బౌల్డ్ చేసింది. ఒకే ఓవర్లో సోఫియా, హర్లీన్ (4)ను రాజేశ్వరి బుట్టలో వేసుకుంది. ఆ ప్రభావం జట్టుపై పడకుండా హేమలత, గార్డ్‌నర్ చెలరేగారు. నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. గార్డ్‌నర్ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోగా.. హేమలత మాత్రం మొదటి నుంచే బాదుడు షురూ చేసింది. రాజేశ్వరి ఓవర్లో బౌలర్ తలమీదుగా చక్కని సిక్సర్ కొట్టింది. మెల్లగా గార్డ్‌నర్ కూడా గేరు మార్చడంతో గుజరాత్ ఇన్నింగ్స్ రాకెట్ వేగాన్ని అందుకుంది. సోఫీ ఎకిల్‌స్టోన్ (1/27) బౌలింగ్‌లో గార్డ్‌నర్ క్రీజు వదిలి ముందుకు వచ్చి కళ్లు చెదిరే సిక్సర్ కొట్టింది. మరో సిక్సర్‌తో హేమలత 30 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసింది. 16 ఓవర్లకు 143/3తో నిలిచిన గుజరాత్.. 190కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ టీనేజీ సంచలనం పార్శవి చివర్లో మాయ చేసింది. తన లెగ్‌స్పిన్‌తో వరుస ఓవర్లలో హేమలత, గార్డ్‌నర్‌ను వెనక్కి పంపింది. దీంతో గుజరాత్ స్కోరు కొంచెం తగ్గింది.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (సి) అంజలి (బి) రాజేశ్వరి 23; లారా (బి) అంజలి 17; హర్లీన్ (సి) సిమ్రాన్ (బి) రాజేశ్వరి 4; హేమలత (సి) తాలియా (బి) పార్శవి 57; ఆష్లీ గార్డ్‌నర్ (స్టంప్డ్) హీలీ (బి) పార్శవి 60; సుష్మ నాటౌట్ 8; అశ్విని ఎల్బీ (బి) ఎకిల్‌స్టోన్ 5; కిమ్ గార్త్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-41, 2-45, 3-50, 4-143, 5-166, 6-177; బౌలింగ్: అంజలి శర్వాణి 3-0-21-1; రాజేశ్వరి 4-0-39-2; సోఫీ ఎకిల్‌స్టోన్ 4-0-27-1; దీప్తి శర్మ 4-0-49-0; పార్శవి చోప్రా 4-0-29-2; గ్రేస్ హారిస్ 1-0-11-0
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: దేవిక (సి) సుష్మ (బి) తనూజ 7; అలీసా హీలీ (సి) హర్లీన్ (బి) మోనిక 12; కిరణ్ (సి) లారా (బి) కిమ్ 4; తాలియా (సి) స్నేహ్ (బి) గార్డ్‌నర్ 57; హారిస్ (సి) హర్లీన్ (బి) కిమ్ 72; దీప్తి (సి) గార్డ్‌నర్ (బి) స్నేహ్ 6; ఎకిల్‌స్టోన్ నాటౌట్ 19; సిమ్రాన్ రనౌట్ 1; అంజలి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3: మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-14, 2-19, 3-39, 4-117, 5-130, 6-172, 7-177; బౌలింగ్: కిమ్ గార్త్ 4-0-29-2; మోనిక 3-0-27-1; ఆష్లీ గార్డ్‌నర్ 4-0-29-1; తనూజ 4-0-32-1; స్నేహ్ రాణా 3.5-0-47-1; హర్లీన్ 1-0-17-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఈనెల 11నుంచి అందుబాటులోకి హార్టీకల్చర్ హాల్‌టికెట్లు
-
India News
Rajnath Singh: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: రాజ్‌నాథ్ సింగ్
-
Movies News
Shah Rukh Khan: షారుఖ్ ఐకానిక్ పోజ్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందిలా
-
Crime News
Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో సెర్చ్!
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ