పసిడికి పంచ్ దూరంలో..
వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు యువ సంచలనం నిఖత్ జరీన్ మరో బౌట్ దూరంలో ఉంది.
ఫైనల్లో నిఖత్ జరీన్
నీతు, లవ్లీనా, స్వీటీ కూడా
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్
వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు యువ సంచలనం నిఖత్ జరీన్ మరో బౌట్ దూరంలో ఉంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణానికి, ఆమెకు మధ్య మరో పోరు మాత్రమే మిగిలింది. ఫేవరెట్ అంచనాలను నిలబెట్టుకుంటూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయిస్తూ సాగుతున్న ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది. లవ్లీనా, నీతు, స్వీటీ కూడా తుదిపోరుకు చేరారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండో ఏడాదీ పసిడి ముద్దాడేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ దూరంలో నిలిచింది. పోటీపడే బరువు విభాగం మారినా.. అదే దూకుడు కొనసాగిస్తున్న ఆమె 50 కేజీల విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీస్‌లో 26 ఏళ్ల నిఖత్ 5-0 తేడాతో కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సియాను చిత్తుచేసింది. క్వార్టర్స్‌లో రక్సాత్ నుంచి ప్రతిఘటన ఎదుర్కున్నా పోరాడి గెలిచిన నిఖత్.. వాలెన్సియాతో సమరంలో జూలు విదిల్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన 34 ఏళ్ల వాలెన్సియా.. నిఖత్ ధాటికి నిలవలేకపోయింది. తొలి రౌండ్ మొదలయ్యిందో లేదో నిఖత్ చేతులు వేగాన్ని అందుకున్నాయి. ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకుని పంచ్‌లు కురిపించాయి. ఎడమ చేతిని చూపిస్తూ.. కుడి చేతి పంచ్‌లతో తెలంగాణ అమ్మాయి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. రింగ్‌లో చిరుతలా కదులుతూ రియో ఒలింపిక్స్ కాంస్య విజేత వాలెన్సియాను బోల్తా కొట్టిస్తూ పిడిగుద్దులతో సాగింది. విక్టోరియాకు నిఖత్‌ను ఆపడానికే సమయం సరిపోయింది. తొలి రౌండ్‌లో 4-1తో మన బాక్సర్‌దే ఆధిపత్యం. రెండో రౌండ్లో ఆమె మరింతగా చెలరేగింది. పదేపదే ప్రత్యర్థి పైకి దూసుకెళ్లింది. దాడిని ఉద్ధృతం చేసింది. కాళ్లను ఓ వైపు కదుపుతూ పంచ్‌లు మరోవైపు విసురుతూ ప్రత్యర్థిని తికమక పెట్టింది. ప్రత్యర్థికి దిమ్మతిరిగేలా హుక్, సైడ్ పంచ్‌లిచ్చింది. ముఖంపై నేరుగా ముష్ఠిఘాతాలు కురిపించింది. మూడో రౌండ్‌లోనూ ఆమెదే హవా. కిందకు వంగి ప్రత్యర్థి ముఖంపై పంచ్‌లు విసిరింది. చివరివరకూ అదే దూకుడు కొనసాగించింది. అయిదుగురు జడ్జీల నిఖత్‌కు అనుకూలంగా తీర్పిచ్చారు. ఫైనల్లో న్యూయెన్ (వియత్నాం)తో నిఖత్ తలపడుతుంది.
ఈ ముగ్గురూ అదుర్స్
ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు గాంగాస్ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. నిరుడు క్వార్టర్స్‌లో తనను ఓడించిన అలువా బల్కిబెకోవా (కజకిస్థాన్)పై నీతు ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‌లో ఆమె 5-2తో గతేడాది రజత విజేత బల్కిబెకోవాను ఓడించింది. తొలి రౌండ్‌లో 2-3తో వెనకబడ్డప్పటికీ నీతు అద్భుతంగా పుంజుకుంది. తనను ప్రత్యర్థి తరచుగా నెడుతూ, కిందపడేసినా.. తిరిగి లేచిన ఆమె పంచ్‌లతో విరుచుకుపడింది. ఉత్కంఠగా సాగిన చివరి రౌండ్లోనూ నీతు అదే వేగాన్ని ప్రదర్శించింది. పోరు హోరాహోరీగా ముగియడంతో చివరికి సమీక్షలో నీతును విజేతగా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గిన లవ్లీనా.. తొలిసారి ఈ టోర్నీ తుదిపోరు చేరింది. సెమీస్‌లో ఆమె 4-1తో లి కియాన్ (చైనా)ను ఓడించింది. స్వీటీ 4-3తో ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచింది.
‘‘ఇది నా ఉత్తమ బౌట్. టెక్నిక్ పరంగా మెరుగ్గా ఉన్న బాక్సర్లను ఎదుర్కొన్నప్పుడు నేను అత్యుత్తమంగా ఆడతాననిపిస్తుంది. వాలెన్సియాతో గతంలోనూ తలపడ్డా. ఆమె అనుభవమున్న బాక్సర్. ఆమెతో పోరు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాగింది’’
నిఖత్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..