పంత్‌ స్థానాన్ని భర్తీ చేయలేం

రిషబ్‌ పంత్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. జట్టుపై అతని ప్రభావం అలాంటిదని పేర్కొన్నాడు.

Published : 25 Mar 2023 01:56 IST

దిల్లీ: రిషబ్‌ పంత్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. జట్టుపై అతని ప్రభావం అలాంటిదని పేర్కొన్నాడు. ‘‘రోడ్డు ప్రమాదానికి గురై పంత్‌ ఆటకు దూరం కావడం దురదృష్టకరం. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు అతడి లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో అతడొకడు. రిషబ్‌ మా నాయకుడే కాదు.. నంబర్‌.4లో కీలక బ్యాటర్‌, ఫినిషర్‌ కూడా. అతడి స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం’’ అని రికీ అన్నాడు. ఐపీఎల్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందని రికీ తెలిపాడు. ‘‘మ్యాచ్‌లో అవసరాన్ని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో బౌలరో లేదా బ్యాటర్‌నో తీసుకోవచ్చు. దీని వల్ల ఒకే ఆటగాడు రెండు పాత్రలు పోషించాల్సిన అవసరం ఉండదు’’ రికీ అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు