తెలంగాణకు కాంస్యం

అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ పురుషుల జట్టు మెరిసింది.

Published : 25 Mar 2023 01:58 IST

జమ్ము: అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ పురుషుల జట్టు మెరిసింది. 2020లో చారిత్రక ప్రదర్శనను ఇప్పుడు పునరావృతం చేసి.. మరోసారి కాంస్య పతకం ముద్దాడింది. సెమీస్‌లో తెలంగాణ 2-3 తేడాతో రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఆర్‌ఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడింది. తొలి సింగిల్స్‌లో మహమ్మద్‌ అలీ 5-11, 11-6, 4-11, 7-11తో రోనిత్‌ చేతిలో ఓడడంతో తెలంగాణ 0-1తో పోరును మొదలెట్టింది. రెండో సింగిల్స్‌లో స్నేహిత్‌ 11-9, 11-5, 10-12, 7-11, 11-5తో అనిర్బన్‌పై గెలిచి 1-1తో స్కోరు సమం చేశాడు. కానీ మూడో మ్యాచ్‌లో వాన్ష్‌ సింగాల్‌ ఓడిపోవడంతో తెలంగాణ 1-2తో వెనుకబడింది. ఆ దశలో స్నేహిత్‌ 11-9, 11-3, 11-8తో రోనిత్‌పై గెలిచి మరోసారి 2-2తో జట్టు ఆశలు నిలిపాడు. కానీ చివరి సింగిల్స్‌లో మహమ్మద్‌ అలీ 5-11, 9-11, 9-11తో అనిర్బన్‌ చేతిలో ఓడడంతో తెలంగాణకు పరాజయం తప్పలేదు. ఫైనల్లో పీఎస్‌పీబీ 3-1తో ఆర్‌ఎస్‌పీబీని ఓడించి టైటిల్‌ దక్కించుకుంది. మహిళల జట్టు విభాగంలో ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న ఆర్‌బీఐ 3-2తో తమిళనాడుపై నెగ్గి తొలిసారి ఈ ట్రోఫీ కైవసం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని