IPL: ‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’ : దిల్లీ క్యాపిటల్స్‌ సీఈవో

టీమ్‌ఇండియా ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు నివేదిక పంపిందని, స్పష్టమైన ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని దిల్లీ క్యాపిటల్స్‌ సీఈవో ధీరజ్‌ మల్హోత్రా చెప్పాడు.

Updated : 25 Mar 2023 08:44 IST

దిల్లీ: టీమ్‌ఇండియా ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు నివేదిక పంపిందని, స్పష్టమైన ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని దిల్లీ క్యాపిటల్స్‌ సీఈవో ధీరజ్‌ మల్హోత్రా చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో క్రికెటర్ల పని భారంపై బీసీసీఐ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘లేదు. కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి జాతీయ క్రికెట్‌ అకాడమీ ఫ్రాంఛైజీలకు ఓ నివేదిక పంపింది. మా నుంచి వారు ఏమి కోరుకుంటున్నారన్నదానిపై అందులో ఎలాంటి సమాచారం లేదు’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని