నిఖత్‌ కొట్టేయ్‌ మళ్లీ.. నేడు జరీన్‌ ఫైనల్‌

వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు.. దిగ్గజ మేరీకోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించేందుకు..

Updated : 26 Mar 2023 03:53 IST

లవ్లీనా తుదిపోరు కూడా
సా.6 గంటల నుంచి

దిల్లీ: వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు.. దిగ్గజ మేరీకోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించేందుకు.. తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ సిద్ధమైంది. నిరుడు 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న ఆమె.. ఈ సారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకునేందుకు సై అంటోంది. ఆదివారం తుదిపోరులో న్యూయెన్‌ (వియత్నాం)తో నిఖత్‌ తలపడుతోంది. ఈ రోజు నిఖత్‌దే తొలి బౌట్‌. ఫైనల్‌ చేరే క్రమంలో ఆమెకు క్వార్టర్స్‌లో మాత్రమే రక్సాత్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆ సవాలును దాటుకుని ముందంజ వేసిన నిఖత్‌.. సెమీస్‌లో వాలెన్సియాను చిత్తుచేసింది. ఇప్పుడు పసిడి పోరుకు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఆమె ప్రత్యర్థి న్యూయెన్‌కు ఇదే తొలి ఫైనల్‌. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్‌ కూడా దేశానికి స్వర్ణాన్ని అందించాలనే లక్ష్యంతో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఆమెకు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఇదే తొలి ఫైనల్‌. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న నిఖత్‌ జరీన్‌, లవ్లీనా.. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. సెప్టెంబర్‌ 23న ఆరంభమయ్యే ఈ ఆసియా క్రీడలు.. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయర్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు