మనుకు కాంస్యం

భారత స్టార్‌  షూటర్‌  మను బాకర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో కంచు మోగించింది. శనివారం 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో మూడో స్థానంలో నిలిచి పతకం గెలిచింది.

Updated : 26 Mar 2023 06:31 IST

భోపాల్‌: భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో కంచు మోగించింది. శనివారం 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో మూడో స్థానంలో నిలిచి పతకం గెలిచింది. ఇదే విభాగంలో పోటీపడిన తెలుగమ్మాయి ఇషా సింగ్‌ పతకం సాధించడంలో విఫలమైంది. ర్యాపిడ్‌ రౌండ్లో మూడు సిరీస్‌ల్లో 294 (98, 99, 97) పాయింట్లు సాధించిన మను మూడో స్థానంతో ర్యాంకింగ్‌ రౌండ్‌కు అర్హత పొందింది. ఇషా (289) ఎనిమిదో స్థానంలో నిలిచి తర్వాతి దశకు చేరుకుంది. అయితే ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో ఇషా విఫలం కాగా.. 14 పాయింట్లు సాధించిన మను, జర్మనీ షూటర్‌ డొరీన్‌ (14), చైనా షూటర్లు జియు డు (12), యాగ్జుయన్‌ జియాంగ్‌ (12) పతక రౌండ్‌ చేరారు. నలుగురి మధ్య పోటీలో బాకర్‌ (20 పాయిట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. డొరీన్‌ (30) స్వర్ణం, జియు డు (29) రజతం నెగ్గారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని