నిర్వాహకుల వైఫల్యం మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రి ఆలస్యం

దిల్లీలో శనివారం నుంచి జరగాల్సిన ఫిడే మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రి తీవ్రమైన  నిర్వహణ వైఫల్యం కారణంగా ఆరంభం కాలేదు.

Published : 26 Mar 2023 02:19 IST

దిల్లీ: దిల్లీలో శనివారం నుంచి జరగాల్సిన ఫిడే మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రి తీవ్రమైన  నిర్వహణ వైఫల్యం కారణంగా ఆరంభం కాలేదు. టోర్నీని ఒక రోజు ముందుకు జరపాల్సి వచ్చింది. చెస్‌ గ్రాండ్‌ ప్రి ఇప్పుడిక ఆదివారం ప్రారంభమవుతుంది. టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు శుక్రవారం ఇక్కడికి చేరుకోగా.. నిర్వాహకులు విమానాశ్రయం నుంచి వారికి ఎలాంటి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. దీంతో క్రీడాకారులు సొంతంగా ట్యాక్సీల్లో బయల్దేరారు. పైగా తమకు కేటాయించిన హోటల్‌ గదులు ఇంకా సిద్ధం కాకపోవడంతో హోటళ్లో వాళ్లు నిరీక్షించాల్సివచ్చింది. తీవ్ర అసంతృప్తి చెందిన కజకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాన్సాయా అబ్దుమలిక్‌ గ్రాండ్‌ ప్రి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. అయితే టోర్నీని కొనసాగించాలని ఫిడే నిర్ణయించింది. తొలి రోజును విశ్రాంతి దినంగా ప్రకటించినట్లు సమాచారం. ఫిడే అధ్యక్షుడు ద్వర్కోవిచ్‌ క్రీడాకారులకు క్షమాపణ చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని