కోపా మ్యూజియంలో మెస్సి విగ్రహం

అర్జెంటీనాకు చరిత్రాత్మక ప్రపంచకప్‌ అందించిన దిగ్గజ ఆటగాడు లియొనల్‌ మెస్సికి గౌరవ సత్కారాల పరంపర ఇంకా కొనసాగుతోంది.

Published : 29 Mar 2023 02:43 IST

లొకె (పరాగ్వే): అర్జెంటీనాకు చరిత్రాత్మక ప్రపంచకప్‌ అందించిన దిగ్గజ ఆటగాడు లియొనల్‌ మెస్సికి గౌరవ సత్కారాల పరంపర ఇంకా కొనసాగుతోంది. లోకెలోని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రధాన కార్యాలయంలో మెస్సి బృందాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా మెస్సి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని అక్కడే ఉన్న కోపా మ్యూజియంలో ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ దిగ్గజాలు పీలే, మారడోనా సరసన ఉంచనున్నారు. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌పై నెగ్గి సుదీర్ఘ విరామం తర్వాత అర్జెంటీనా ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు