భరాలికి కాంస్యం

అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది.

Published : 29 Mar 2023 02:46 IST

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌

దిల్లీ: అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 67 కేజీల కేటగిరిలో భరాలి బేద్‌బ్రతే కాంస్యం కైవసం చేసుకున్నాడు. స్నాచ్‌లో 119 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 148 కేజీలు లిఫ్ట్‌ చేసిన భరాలి మొత్తం మీద 267 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనూ ఈ భారత కుర్రాడు కాంస్యం నెగ్గాడు. కాంటినెంటల్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ల్లో కూడా విడిగా పతకాలు ఇస్తారు. మహిళల 49 కేజీల కేటగిరిలో కోయల్‌ బార్‌ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. కోయల్‌ మొత్తం 144 కేజీలు (స్నాచ్‌ 64 + క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 80) లిఫ్ట్‌ చేసింది. 55 కేజీల విభాగంలో మినా శాంటా 153 కేజీలతో (స్నాచ్‌ 70 + క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 83) 13వ స్థానం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు