సంక్షిప్త వార్తలు(5)
ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచేందుకు ప్రయత్నిస్తానని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జో రూట్ అన్నాడు. తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ ఆడుతున్న రూట్.. బౌలర్లు ఊహించనట్లుగా ఉంటానని తెలిపాడు
బౌలర్లు ఊహించనట్లుగా ఉంటా: రూట్
జైపుర్: ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచేందుకు ప్రయత్నిస్తానని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జో రూట్ అన్నాడు. తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ ఆడుతున్న రూట్.. బౌలర్లు ఊహించనట్లుగా ఉంటానని తెలిపాడు. ‘‘నేను నాలా ఉండటానికి.. బౌలర్లు ఊహించనట్లుగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చేలా కష్టపడతా. ఐపీఎల్‌లో ఇంతకుముందు ఆడలేదు. నాకిదంతా కొత్త. అంతర్జాతీయ క్రికెట్లో విస్తృత అనుభవం కలిగిన నాకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తోంది. ఐపీఎల్ గురించి చాలా విషయాలు విన్నా. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రూట్ చెప్పాడు.
పంత్ స్థానంలో అభిషేక్!
దిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన వికెట్‌కీపర్ రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పొరెల్ దిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 21 ఏళ్ల అభిషేక్‌ను జట్టులోకి తీసుకోవాలని దిల్లీ భావిస్తోందని సమాచారం. అభిషేక్ జట్టులోకి వచ్చినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు సర్ఫ్‌రాజ్ ఖాన్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
బంగ్లాదేశ్‌దే సిరీస్
ఛటోగ్రాం: ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 2-0తో సొంతం చేసుకుంది. బుధవారం వర్షం ప్రభావంతో 17 ఓవర్లకు కుదించిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 77 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 17 ఓవర్లలో 3 వికెట్లకు 202 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (83; 41 బంతుల్లో 10×4, 3×6) చెలరేగాడు. 18 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న అతను.. బంగ్లా తరపున టీ20ల్లో వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా అష్రాఫుల్ (వెస్టిండీస్‌పై 20 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. రోని (44; 23 బంతుల్లో 3×4, 2×6), షకిబ్ (38 నాటౌట్; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. షకిబ్ (5/22) ధాటికి ఛేదనలో ఐర్లాండ్ 17 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. కర్టీస్ కాంఫర్ (50; 30 బంతుల్లో 3×4, 3×6) టాప్‌స్కోరర్. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ (3/27) కూడా మెరిశాడు.
స్కీట్ టీమ్‌లో భారత్ విఫలం
దిల్లీ: ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ (సైప్రస్) స్కీట్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే ఈ విభాగం వ్యక్తిగత విభాగాల్లో విఫలమైన మన షూటర్లు.. మిక్స్‌డ్ టీమ్ కేటగిరిలోనూ పేలవ ప్రదర్శన చేశారు. పెయిర్ క్వాలిఫికేషన్లో అంగద్ వీర్ బజ్వా-అరీబాఖాన్ (131/150) జోడీ 16వ స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత జంట మాన్‌సింగ్-రైజా థిల్లాన్ (125/150) 22వ స్థానంలో నిలిచింది. ట్రాప్ కేటగిరిలో పోటీలు శుక్రవారం ఆరంభం కానున్నాయి.
తొలి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం
దిల్లీ: పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో ఆ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుమతి ఇంకా లభించలేదు. ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాక అతడికి అనుమతి ఇచ్చే అవకాశముంది. ఏప్రిల్ 1న కోల్‌కతాతో పంజాబ్ తొలి మ్యాచ్ ఆడనుంది. నిరుడు డిసెంబర్‌లో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్‌కు అదే మ్యాచ్‌లో మోకాలికి దెబ్బ తగిలింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో