మెస్సి సెంచరీ

కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ లియొనల్‌ మెస్సి మరో మైలురాయి అందుకున్నాడు

Published : 30 Mar 2023 02:42 IST

సాంటియాగో డెల్‌ ఇస్టెరో: కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ లియొనల్‌ మెస్సి మరో మైలురాయి అందుకున్నాడు. కురసావోతో స్నేహపూర్వక మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన అతడు.. ఈ క్రమంలో దేశం తరఫున 100 గోల్స్‌ ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. కురసావోతో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో మెస్సి (20, 33, 37 ని) మూడు గోల్స్‌ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. అతడితో పాటు గోంజెలెజ్‌ (23వ), ఫెర్నాండెజ్‌ (35వ), డిమారియా (78వ), మాంటియెల్‌ (87వ) కూడా ఒక్కో గోల్‌ కొట్టడంతో  అర్జెంటీనా 7-0తో ఘన విజయాన్ని అందుకుంది. అధికారిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దేశం తరఫున ఎక్కువ గోల్స్‌ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెస్సి మూడో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (122), ఇరాన్‌ ఆటగాడు అలీ డాయ్‌ (109) మాత్రమే అతడికన్నా ముందున్నారు. భారత స్టార్‌ సునీల్‌ ఛెత్రి (85) అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు