విండీస్‌దే టీ20 సిరీస్‌

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఊహించని ఫలితం. మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్‌ 2-1తో సఫారీ జట్టును చిత్తు చేసింది.

Updated : 30 Mar 2023 03:16 IST

జొహానెస్‌బర్గ్‌: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఊహించని ఫలితం. మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్‌ 2-1తో సఫారీ జట్టును చిత్తు చేసింది. రెండో టీ20లో రికార్డు స్థాయిలో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మార్‌క్రమ్‌ బృందం ఆఖరి మ్యాచ్‌లో 221 పరుగులు ఛేదించడంలో విఫలమైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ (5/40) విజృంభించడంతో విండీస్‌ 7 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ సొంతం చేసుకుంది. బ్రాండన్‌ కింగ్‌ (36; 25 బంతుల్లో 4×4, 2×6), నికోలస్‌ పూరన్‌ (41; 19 బంతుల్లో 2×4, 4×6), రొమారియో షెఫర్డ్‌ (44 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 3×6) చెలరేగడంతో మొదట విండీస్‌ 8 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఆఖరి వరకు పోరాడినా 6 వికెట్లకు 213 పరుగులే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్‌ (83; 44 బంతుల్లో 11×4, 2×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్లింది. ఆ జట్టుకు 12 బంతుల్లో 35 పరుగులు అవసరమైన దశలో.. బంతి అందుకున్న జోసెఫ్‌ ఒకే ఓవర్లో రీజా, క్లాసెన్‌ (6), పార్నెల్‌ (2)లను పెవిలియన్‌కు పంపి విండీస్‌కు గెలుపు ఖాయం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు