Steve Smith: ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
2017 ఐపీఎల్ సీజన్‌లో ధోనీకి కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కొంచెం కష్టంగా అనిపించిందని అప్పటి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ సారథి, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తెలిపాడు.
దిల్లీ: 2017 ఐపీఎల్ సీజన్‌లో ధోనీకి కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కొంచెం కష్టంగా అనిపించిందని అప్పటి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ సారథి, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఆ సీజన్‌లో ఫైనల్ చేరుకున్న పుణె.. ఒక్క పరుగు తేడాతో టైటిల్‌కు దూరమైంది. ‘‘నన్ను కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటున్నట్లు చెప్పగానే కొంచెం కష్టంగా అనిపించింది. అయితే ఆ సీజన్‌లో ధోని అద్భుతంగా ఆడాడు. అన్ని రకాలుగా అతను నాకు సహాయం అందించాడు. అతనో గొప్ప వ్యక్తి. అతనికి సారథ్యం వహించడం గొప్ప అనుభవం. కానీ చాలా కష్టం కూడా. ధోని నుంచి ఏం ఆశించాలో మొదట్లో నాకు తెలియలేదు. ఆడిన అన్ని జట్లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లో చెన్నైకి సారథ్యం వహించాడు. నన్ను కెప్టెన్‌గా ఉండమన్నప్పుడు షాక్‌కు గురయ్యా. ఏం చెప్పాలో అర్థంకాలేదు. కెప్టెన్సీ గురించి ధోనీతో మాట్లాడారా? అని అడిగా. అది నాకు కాస్త వింతగా అనిపించింది. ఆ తర్వాత అన్నీ సరిచేసుకున్నాం. ధోని అదరగొట్టాడు. అతను నాకు సహాయం చేసిన పద్ధతి.. జట్టుకు మార్గనిర్దేశనం చేయడంలో తోడ్పడిన విధానం అసాధారణం. అందుకు ధోనీకి తగినంతగా కృతజ్ఞతలు చెప్పలేకపోయా’’ అని స్మిత్ వివరించాడు. ఈసారి స్మిత్‌ను ఏ జట్టు తీసుకోలేదు. అతడు ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు