ఐపీఎల్‌ ఆరంభోత్సవంలో తమన్నా ఆట

ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ వేడుకల్లో నటి తమన్నా భాటియా తళుక్కున మెరువనుంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్‌ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

Published : 30 Mar 2023 02:51 IST

దిల్లీ: ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ వేడుకల్లో నటి తమన్నా భాటియా తళుక్కున మెరువనుంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్‌ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో తమన్నా తన స్టెప్పులతో ఉర్రూతలూగించనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఐపీఎల్‌ ట్వీట్‌ చేసింది. ఈ సారి కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైన తొలి నటి ఆమెనే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య పోరుతో ఈ సీజన్‌కు తెరలేవనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని