హంపికి తొలి ఓటమి

మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్లో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి తొలి ఓటమి ఎదురైంది.

Published : 30 Mar 2023 02:53 IST

దిల్లీ: మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్లో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి తొలి ఓటమి ఎదురైంది. బుధవారం నాలుగో రౌండ్లో జుహు జినెర్‌ (చైనా) చేతిలో 36 ఎత్తుల్లో ఓడిపోయింది. మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి కూడా పరాజయం చవిచూసింది. లాగ్నో కేథరీనా (రష్యా) 40 ఎత్తుల్లో వైశాలి ఆట కట్టించింది. వరుసగా మూడు డ్రాలు చేసుకున్న హంపి (1.5 పాయింట్లు) తాజా ఓటమితో ఏడో స్థానంలో ఉండగా.. ఇంకా ఖాతా తెరవని వైశాలి.. పన్నెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా 3 రౌండ్లు ఆడి 1.5 పాయింట్లు సాధించిన ద్రోణవల్లి హారిక.. ఆరో స్థానంలో ఉంది. 2.5 పాయింట్లతో జుహు జినెర్‌ (చైనా) అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇంకా 7 రౌండ్లు మిగిలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు