రషీద్‌ @1

ఐసీసీ వన్డే బ్యాటర్లలో భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తాజా జాబితాలో అతడు ఒక స్థానం మెరుగయ్యాడు. భారత్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ (5) ఉత్తమ ర్యాంకు సాధించగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Updated : 30 Mar 2023 02:59 IST

దుబాయ్‌: ఐసీసీ వన్డే బ్యాటర్లలో భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తాజా జాబితాలో అతడు ఒక స్థానం మెరుగయ్యాడు. భారత్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ (5) ఉత్తమ ర్యాంకు సాధించగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో భారత్‌ నుంచి మహ్మద్‌ సిరాజ్‌ (3వ ర్యాంకు) మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ నంబర్‌వన్‌ బ్యాటర్‌ ఉండగా.. భారత్‌ నుంచి అతడి తర్వాత కోహ్లి (16)కి మాత్రమే టాప్‌-20లో చోటు దక్కింది. బౌలర్లలో అఫ్గానిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ మళ్లీ నంబర్‌వన్‌ అయ్యాడు. శ్రీలంకతో సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీసిన అతడు హసరంగ (శ్రీలంక)ను వెనక్కి నెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు