అంచనాలు ఇబ్బందిపెట్టవు

ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నందున అభిమానుల అంచనాలు తనను ఇబ్బందిపెట్టవని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు.

Published : 30 Mar 2023 03:02 IST

ముంబయి: ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నందున అభిమానుల అంచనాలు తనను ఇబ్బందిపెట్టవని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. కుర్రాళ్లపై అనవసర ఒత్తిడి తీసుకురానంటూ ఐపీఎల్‌లో అయిదు సార్లు ముంబయిని విజేతగా నిలిపిన రోహిత్‌ తెలిపాడు. ‘‘ఐపీఎల్‌ ఒక్కటే కాదు ఎప్పుడు ఆడినా అంచనాలు ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నందున అంచనాలు నన్ను ఇబ్బందిపెట్టవు. అభిమానులు ఏం ఆశిస్తున్నారో అని ఆందోళన చెందను. అత్యుత్తమ ప్రదర్శనతో ట్రోఫీ గెలవాలని మాకు తెలుసు. నిరంతరం అదే ఆలోచించడం అనవసరపు ఒత్తిడిని తెచ్చుకోవడమే. కుర్రాళ్లపై కూడా ఒత్తిడి తీసుకురావాలని అనుకోవట్లేదు. వాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నామో కుర్రాళ్లకు బాగా తెలుసు. ఫస్ట్‌క్లాస్‌, క్లబ్‌ క్రికెట్లో మాదిరే ఐపీఎల్‌లో ఆడమని వాళ్లకు చెప్పేందుకు ప్రయత్నిస్తా. బుమ్రా గైర్హాజరీ తీరని లోటే. కాని మరో ఆటగాడికి అది అవకాశం’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని