సంక్షిప్త వార్తలు (5)
అజర్‌బైజాన్‌లోని బాకులో మే 8న ఆరంభమయ్యే ప్రపంచకప్ షూటింగ్ స్టేజ్-5 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ చోటు దక్కించుకుంది.
ప్రపంచకప్ షూటింగ్‌కు ఇషా
దిల్లీ: అజర్‌బైజాన్‌లోని బాకులో మే 8న ఆరంభమయ్యే ప్రపంచకప్ షూటింగ్ స్టేజ్-5 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ చోటు దక్కించుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌లో మను బాకర్ స్థానంలో ఇషా ఆడనుంది. 25 మీటర్ల పిస్టల్ కేటగిరిలో మను బరిలో దిగుతోంది. భోపాల్‌లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నీలో ఈ విభాగంలోనే మను కాంస్యం నెగ్గింది. ఇదే టోర్నీలో రాణించిన సాహు తుషార్ మానె (10 మీ ఎయిర్ రైఫిల్), శివ నర్వాల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) కూడా ప్రపంచకప్ (స్టేజ్-5) బెర్తు దక్కించుకున్నారు.
వైశాలి గేమ్ డ్రా
దిల్లీ: మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో వైశాలికి వరుసగా రెండో డ్రా ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్లో గొర్యాకీనా (రష్యా)తో 35 ఎత్తుల్లో ఆమె డ్రాగా ముగించింది. దీంతో వైశాలి (1 పాయింట్) పదో స్థానంలో కొనసాగుతోంది. కోనేరు హంపి (2.5) నాలుగు, ద్రోణవల్లి హారిక (1.5) ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి. అసుబయెవా (కజకిస్థాన్, 4 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇంకో 5 రౌండ్లు మిగిలున్నాయి.
దక్షిణాఫ్రికాదే రెండో వన్డే
బెనోని: నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం రెండో వన్డేలో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట నెదర్లాండ్స్ 46.1 ఓవర్లలో 189కే ఆలౌటైంది. తేజ (48), విక్రమ్‌జీత్ సింగ్ (45) మాత్రమే రాణించారు. మగాల (3/37), షంసి (3/25), నోకియా (2/24) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో కెప్టెన్ బవుమా (90 నాటౌట్; 79 బంతుల్లో 8×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి అందుకుంది. బవుమాతో పాటు మార్‌క్రమ్ (51 నాటౌట్), వాండర్‌డసెన్ (31) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి వన్డే వర్షంతో రద్దయింది.
ఐర్లాండ్‌కు ఊరట విజయం
చట్‌గావ్: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న ఐర్లాండ్‌కు ఊరట విజయం! ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లా 19.2 ఓవర్లలో 124కే ఆలౌటైంది. షమీమ్ (51; 42 బంతుల్లో 5×4, 2×6) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అడైర్ (3/25), హంఫ్రీస్ (2/10) బంగ్లాను కట్టడి చేశారు. ఛేదనలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (77; 41 బంతుల్లో 10×4, 4×6) మెరుపులతో లక్ష్యాన్ని ఐర్లాండ్ 14 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. ఒక దశలో ఐర్లాండ్ 41/2తో నిలిచినా.. దూకుడుగా ఆడిన స్టిర్లింగ్ జట్టును విజయపథంలో నడిపించాడు. ఆఖర్లో అతడు వెనుదిరిగినా.. టెక్టార్ (14 నాటౌట్), కాంఫెర్ (16 నాటౌట్) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
వింబుల్డన్‌లో రష్యా,బెలారస్ క్రీడాకారులు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో రష్యా, బెలారస్ క్రీడాకారులు తటస్థ క్రీడాకారులుగా బరిలో దిగనున్నారు. గత ఏడాది ఆ దేశాలపై విధించిన నిషేధాన్ని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ శుక్రవారం వెనక్కి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు తెలపకుండా ఉండటంతో పాటు పలు షరతులకు క్రీడాకారులు కట్టుబడి ఉండాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ పేర్కొంది. ‘‘వింబుల్డన్‌లో పాల్గొనేందుకు రష్యా, బెలారస్‌లకు చెందిన కంపెనీల స్పాన్సర్‌షిప్‌ల నుంచి నిధులు పొందకూడదు’’ అని క్లబ్ తెలిపింది. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్ ప్రారంభమవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ బంతులే ఆయుధాలు: స్మిత్
-
India News
The Lancet: దేశంలో పెరుగుతోన్న షుగర్.. బీపీ బాధితులు!
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?