బుమ్రా స్థానంలో సందీప్‌

గాయంతో ఈ సీజన్‌ మొత్తానికి దూరమైన ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్థానంలో కేరళ పేసర్‌ సందీప్‌ వారియర్‌ జట్టులోకొచ్చాడు.

Published : 01 Apr 2023 02:30 IST

ముంబయి: గాయంతో ఈ సీజన్‌ మొత్తానికి దూరమైన ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్థానంలో కేరళ పేసర్‌ సందీప్‌ వారియర్‌ జట్టులోకొచ్చాడు. 2021లో శ్రీలంకతో ఓ టీ20 ఆడిన సందీప్‌.. ఇప్పటిదాకా 66 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 217 వికెట్లు పడగొట్టాడు. 68 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. దేశవాళీలో ఆరంభంలో కేరళకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. 2020 నుంచి తమిళనాడుకు ఆడుతున్నాడు. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో ఇషాన్‌ పోరెల్‌ను ఎంచుకుంది. గాయం కారణంగా హేజిల్‌వుడ్‌ బెంగళూరు ఆడే తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని