ఆ స్పష్టత వచ్చాకే ఆటల్లోకి..

ఆటలను కెరీర్‌గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలని భారత అగ్రశ్రేణి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సూచించాడు.

Published : 01 Apr 2023 04:35 IST

బెంగళూరు: ఆటలను కెరీర్‌గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలని భారత అగ్రశ్రేణి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సూచించాడు. ‘‘గణితం మినహా పాఠశాలలో చదువులో నా ప్రదర్శన మెరుగ్గానే ఉండేది. కానీ పదో తరగతి తర్వాత భారత అండర్‌-19 జట్టుకు ఆడడం వల్ల ఎక్కువగా తరగతులకు వెళ్లలేకపోయా. అప్పుడు.. ‘పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తావా? నీ శక్తినంతా ఆటకే ఖర్చు చేస్తావా’ అని నాన్న అడిగితే అవునని చెప్పా. ఆటలను కెరీర్‌గా ఎంచుకుంటామనే కచ్చితమైన స్పష్టత వచ్చేంతవరకూ చదువుపై ధ్యాస పెట్టాలి. క్రీడలకు పూర్తి సమయం కేటాయించేందుకు, దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అది విఫలమైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక గురించి ఆలోచించాలి’’ అని ఓ కార్యక్రమంలో కోహ్లి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని