భారత పేస్‌ ‘కంగారు’ పెడుతుంది: రాస్‌ టేలర్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లను టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌ ఇబ్బంది పెట్టగలదని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌ అన్నాడు.

Published : 01 Apr 2023 02:30 IST

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లను టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌ ఇబ్బంది పెట్టగలదని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌ అన్నాడు. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. ‘‘ఇంగ్లాండ్‌లో ఎప్పుడు ఆడినా పరిస్థితులు, వాతావరణం కీలకపాత్ర పోషిస్తాయి. భారత్‌, ఆస్ట్రేలియా తటస్థ వేదికలో ఆడుతున్నాయంటే పేసర్లదే ముఖ్యభూమిక. డ్యూక్‌ బంతులతో ఆసీస్‌ పేసర్లు సమర్థంగా బౌలింగ్‌ చేయగలరు. వాళ్లకు చాలా అనుభవం ఉంది. అయితే భారత బౌలింగ్‌ను తక్కువ చేయడం లేదు. కొన్నేళ్లుగా అక్కడ టీమ్‌ఇండియా చాలా విజయాలు సాధించింది. విజయం అందించిన పేసర్లలో కొందరు అందుబాటులో ఉన్నారు. కాని బుమ్రాను భర్తీచేయడం చాలా కష్టం. మూడు ఫార్మాట్లలో అతను అద్భుతమైన బౌలర్‌. భారత బౌలింగ్‌ దళానికి అతను నాయకుడు. బుమ్రా లేకపోయినా ఆసీస్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత లోతు భారత బౌలింగ్‌లో ఉంది. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో షమి బృందం అద్భుతంగా ఆడుతుంది. షమి, సిరాజ్‌, ఉమేశ్‌లు డ్యూక్‌ బంతులతో చక్కగా బౌలింగ్‌ చేస్తారు’’ అని టేలర్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు