LSG vs DC: వుడ్.. కూల్చేశాడు
30/1.. మొదట పవర్‌ప్లేలో లఖ్‌నవూ స్కోరిది. కానీ చివరకు చూస్తే 193/6. ఐపీఎల్ అరంగేట్రంలో మేయర్స్ ఫోర్ల కంటే సులువుగా సిక్సర్లు బాదిన వేళ.. పూరన్, బదోని కూడా రాణించడంతో ఆ జట్టు భారీస్కోరు చేసింది.
దిల్లీపై లఖ్‌నవూ ఘనవిజయం
మెరిసిన మేయర్స్
30/1.. మొదట పవర్‌ప్లేలో లఖ్‌నవూ స్కోరిది. కానీ చివరకు చూస్తే 193/6. ఐపీఎల్ అరంగేట్రంలో మేయర్స్ ఫోర్ల కంటే సులువుగా సిక్సర్లు బాదిన వేళ.. పూరన్, బదోని కూడా రాణించడంతో ఆ జట్టు భారీస్కోరు చేసింది.
40/0.. ఛేదనలో 4 ఓవర్లకు దిల్లీ స్కోరిది. కానీ మార్క్ వుడ్ దెబ్బకు చతికిలపడి.. ఒత్తిడికి చిత్తయిన దిల్లీ చివరకు 143/9కే పరిమితమైంది. ఐపీఎల్- 16లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ శుభారంభం చేసింది.
లఖ్‌నవూ : ఐపీఎల్- 16లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. శనివారం 50 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో కైల్ మేయర్స్ (73; 38 బంతుల్లో 2×4, 7×6) సిక్సర్లతో చెలరేగాడు. ఖలీల్ అహ్మద్ (2/30), చేతన్ సకారియా (2/53) రాణించారు. ఛేదనలో మార్క్ వుడ్ (5/14) ధాటికి దిల్లీ 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. వార్నర్ (56; 48 బంతుల్లో 7×4) రాణించాడు. అవేశ్ ఖాన్ (2/29), రవి బిష్ణోయ్ (2/31) కూడా మెరిశారు.
నిలబడలేక..: ఛేదనను దిల్లీ మెరుగ్గా మొదలెట్టింది. ఓపెనర్లు వార్నర్, పృథ్వీ షా (12) ఫోర్ల వేటలో సాగడంతో నాలుగు ఓవర్లకే స్కోరు 40కి చేరింది. కానీ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న మార్క్‌వుడ్ వరుస బంతుల్లో పృథ్వీతో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ (0)ను ఔట్ చేసి దిల్లీని గట్టిదెబ్బ కొట్టాడు. ఈ ఇద్దరూ ఒకే రకంగా ఔటయ్యారు. 147 కిలోమీటర్ల వేగంతో ఆఫ్‌స్టంప్ ఆవల బంతులేసి లోపలికి స్వింగ్ చేసిన మార్క్‌వుడ్.. స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. సర్ఫరాజ్‌నూ అతనే వెనక్కిపంపడంతో 8 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన దిల్లీ 48/3తో కష్టాల్లో పడింది. బిష్ణోయ్ బౌలింగ్‌లో రొసో (30).. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టడంతో 10 ఓవర్లకు దిల్లీ 75/3తో నిలిచింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండడంతో ఒత్తిడికి గురైన రొసో వికెట్ పారేసుకున్నాడు. అప్పుడే దిల్లీ ఓటమి ఖాయమైంది. ఛేదన అసాధ్యంగా మారిన వేళ.. వార్నర్ పోరాటం కొనసాగించాడు. కానీ అవేశ్ ఒకే ఓవర్లో అమన్ (4), వార్నర్‌ను ఔట్ చేయడంతో దిల్లీ పనైపోయింది.
సిక్సర్ల జోరు..: అంతకుముందు దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (8), మేయర్స్ స్వేచ్ఛగా పరుగులు సాధించలేకపోయారు. ఆరో ఓవర్లో సకారియా బౌలింగ్‌లోనే మేయర్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఖలీల్ పట్టలేకపోయాడు. అప్పుడు మేయర్స్ స్కోరు 14 మాత్రమే. ఆ తర్వాత అతను ఒక్కసారిగా విధ్వంసకాండకు పూనుకున్నాడు. అతని బ్యాట్ సిక్సర్లతోనే మాట్లాడింది. ఏడో ఓవర్ నుంచి మొదలు.. ఔటయ్యేంతవరకూ ఓవర్‌కు కనీసం ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. కానీ వరుస ఓవర్లలో దీపక్ హుడా (17), మేయర్స్‌ను ఔట్ చేసిన దిల్లీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేసింది. ఓ అద్భుతమైన బంతితో మేయర్స్‌ను అక్షర్ బౌల్డ్ చేశాడు. అయిదో స్టంప్‌పై పడ్డ బంతి బయటకు స్పిన్ అవుతుందని భావించిన మేయర్స్.. కట్ చేయాలని చూశాడు. కానీ బంతి అనూహ్యంగా లోపలికి తిరిగి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. 10 పరుగుల దగ్గర సర్ఫరాజ్ స్టంపౌట్ అవకాశాన్ని వృథా చేయడంతో బతికిపోయిన పూరన్.. బౌండరీలతో చెలరేగాడు. చివర్లో ఆయుష్ బదోని (18; 7 బంతుల్లో 1×4, 2×6) భారీ షాట్లతో మెరిశాడు. దీంతో చివరి 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 62 పరుగులు పిండుకుంది. తన కోటా పూర్తి చేసిన ఖలీల్ స్థానంలో చివరి ఓవర్‌కు ముందు దిల్లీకి అమన్ ఖాన్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చాడు. బదోని ఔటయ్యాక అతడి స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటింగ్‌కు వచ్చిన కృష్ణప్ప గౌతమ్ (6 నాటౌట్) చివరి బంతికి సిక్సర్ బాదాడు.
లఖ్‌నవూ ఇన్నింగ్స్: రాహుల్ (సి) అక్షర్ (బి) సకారియా 8; మేయర్స్ (బి) అక్షర్ 73; దీపక్ (సి) వార్నర్ (బి) కుల్‌దీప్ 17; కృనాల్ నాటౌట్ 15; స్టాయినిస్ (సి) సర్ఫరాజ్ (బి) ఖలీల్ 12; పూరన్ (సి) పృథ్వీ (బి) ఖలీల్ 36; బదోని (సి) సర్ఫరాజ్ (బి) సకారియా 18; గౌతమ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193; వికెట్ల పతనం: 1-19, 2-98, 3-100, 4-117, 5-165, 6-187; బౌలింగ్: ఖలీల్ 4-0-30-2; ముఖేష్ 4-0-34-0; సకారియా 4-0-53-2; అక్షర్ 4-0-38-1; కుల్‌దీప్ 4-0-35-1
దిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ (బి) వుడ్ 12; వార్నర్ (సి) గౌతమ్ (బి) అవేశ్ 56; మార్ష్ (బి) వుడ్ 0; సర్ఫరాజ్ (సి) గౌతమ్ (బి) వుడ్ 4; రొసో (సి) మేయర్స్ (బి) బిష్ణోయ్ 30; పావెల్ ఎల్బీ (బి) బిష్ణోయ్ 1; అమన్ (సి) పూరన్ (బి) అవేశ్ 4; అక్షర్ (సి) మన్కడ్ (బి) వుడ్ 16; కుల్‌దీప్ నాటౌట్ 6; సకారియా (సి) కృనాల్ (బి) వుడ్ 4; ముఖేష్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-48, 4-86, 5-94, 6-112, 7-113, 8-139, 9-143; బౌలింగ్: మేయర్స్ 1-0-7-0; ఉనద్కత్ 3-0-39-0; గౌతమ్ 4-0-23-0; అవేశ్ 4-0-29-2; మార్క్ వుడ్ 4-0-14-5; రవి బిష్ణోయ్ 4-0-31-2
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు