అటు భానుడు.. ఇటు వరుణుడు
బ్యాటింగ్‌లో భానుక రాజపక్సే, శిఖర్ ధావన్ మెరుపులు.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ విజృంభణ.. మరోవైపు కలిసొచ్చిన వరుణుడు.. వెరసి ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది.
రాణించిన రాజపక్స
కోల్‌కతాపై డ/లూ పద్ధతిలో పంజాబ్ గెలుపు
బ్యాటింగ్‌లో భానుక రాజపక్సే, శిఖర్ ధావన్ మెరుపులు.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ విజృంభణ.. మరోవైపు కలిసొచ్చిన వరుణుడు.. వెరసి ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది.
కోల్‌కతాకు పంజాబ్ పంచ్ ఇచ్చింది. సమష్టిగా రాణించి ఐపీఎల్-16లో బోణీ కొట్టింది. శనివారం ఆ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌పై నెగ్గింది. మొదట భానుక రాజపక్స (50; 32 బంతుల్లో 5×4, 2×6), కెప్టెన్ శిఖర్ ధావన్ (40; 29 బంతుల్లో 6×4) మెరుపులతో పంజాబ్ 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లకు 146/7తో ఉన్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ముందంజలో ఉన్న పంజాబ్ విజయం సాధించింది. రసెల్ (35; 19 బంతుల్లో 3×4, 2×6), వెంకటేశ్ అయ్యర్ (34; 28 బంతుల్లో 3×4, 1×6) శ్రమ ఫలించలేదు. పంజాబ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/19) సత్తా చాటాడు.
ఆరంభంలోనే తడబాటు: ఛేదనలో ఆరంభం నుంచి కోల్‌కతాది తడబాటే. రెండో ఓవర్లోనే మన్‌దీప్ సింగ్ (2), అనుకుల్ రాయ్ (4)లను పెవిలియన్ చేర్చిన అర్ష్‌దీప్ సింగ్.. ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. రహ్మనుల్లా గుర్బాజ్ (22) కొన్ని షాట్లు ఆడినా.. ఎక్కువసేపు నిలవలేదు. ఈ స్థితిలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. కెప్టెన్ నితీష్ రాణా (24; 17 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి ధాటిగా ఆడాడు. ఉన్నంతసేపు నితీష్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. రిషి ధావన్ వేసిన తొమ్మిదో ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్ ఆఖరికి 75/3తో మెరుగ్గానే కనిపించిన కోల్‌కతా .. ఆ తర్వాత 83/5తో తడబడింది. నితీష్‌తో పాటు రింకు సింగ్ (4) వెనుదిరిగాడు. ఈ స్థితిలో వెంకటేశ్‌కు జత కలిసిన రసెల్ మెరుపుదాడికి దిగి కోల్‌కతాలో మళ్లీ ఆశలు రేపాడు. ఉన్నంతసేపు సిక్స్‌లతో అలరించిన ఈ విండీస్ వీరుడు.. పంజాబ్‌లో కలవరం రేపాడు. వెంకటేశ్ కూడా కొన్ని షాట్లు ఆడడంతో కోల్‌కతా 14 ఓవర్లకు 118/5తో నిలిచింది. కానీ ఓవర్ తేడాతో రసెల్, వెంకటేశ్ ఔట్ కావడంతో నైట్‌రైడర్స్ పరాజయం దిశగా సాగింది. వర్షం కారణంగా 16వ ఓవర్ తర్వాత ఆట నిలిచిపోయింది. అప్పటికి శార్దూల్ (8), నరైన్ (7) క్రీజులో ఉన్నారు.
భానుక, ధావన్ మెరుపులు: అంతకుముందు పంజాబ్ భారీ స్కోరు సాధించిందంటే కారణం భానుక రాజపక్స, శిఖర్‌ధావన్ మెరుపులే. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచిన వీళ్లిద్దరూ కోల్‌కతా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23; 12 బంతుల్లో 2×4, 2×6) వేగంగా ఆడి ఔట్ కాగా.. అక్కడ నుంచి ధావన్, భానుక జోరు మొదలైంది. ముఖ్యంగా భానుక చెలరేగాడు. నరైన్ బౌలింగ్‌లో అతడి తల మీదగా కొట్టిన సిక్సర్ హైలైట్. 10 ఓవర్లకు 100/1తో పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది. అర్ధసెంచరీ చేసి ఊపుమీదున్న భానుకను ఉమేశ్ ఔట్ చేయడంతో పంజాబ్‌కు కాస్త బ్రేక్ పడింది. తర్వాత జితేశ్ శర్మ (21; 11 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఓవర్ తేడాతో శిఖర్, జితేశ్ పెవిలియన్ చేరడంతో ఆశించిన దానికంటే పంజాబ్ తక్కువ స్కోరే చేసింది. చివరి ఓవర్లో సామ్ కరన్ (26 నాటౌట్), షారుక్ (11 నాటౌట్) 15 పరుగులు రాబట్టారు. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (1/26) పంజాబ్‌కు కళ్లెం వేశాడు. పంజాబ్ బౌలింగ్ సమయంలో భానుక స్థానంలో రిషి ధావన్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలో దిగాడు.
మొరాయించిన ఫ్లడ్‌లైట్లు : పీసీఏ-ఐఎస్ బింద్రా స్టేడియంలో ఫ్లడ్‌లైట్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ 30 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. ఛేదన కోసం కోల్‌కతా ఓపెనర్లు మన్‌దీప్ సింగ్, రహ్మతుల్లా గుర్బాజ్ బరిలో దిగగా.. స్టేడియంలోని ఆరు ఫ్లడ్‌లైట్లలో కొన్ని లైట్లు వెలగలేదు. దీంతో కాసేపు వేచి చూసిన కోల్‌కతా ఓపెనర్లు తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. సిబ్బంది.. లైట్లకు మరమ్మతులు చేసిన తర్వాత ఆట అరగంట ఆలస్యంగా మొదలైంది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) రహ్మనుల్లా (బి) సౌథీ 23; ధావన్ (బి) వరుణ్ 40; భానుక రాజపక్స (సి) రింకు (బి) ఉమేశ్ 50; జితేశ్ శర్మ (సి) ఉమేశ్ (బి) సౌథీ 21; సికందర్ రజా (సి) నితీష్ (బి) నరైన్ 16; సామ్ కరన్ నాటౌట్ 26; షారుక్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-23, 2-109, 3-135, 4-143, 5-168; బౌలింగ్: ఉమేశ్ 4-0-27-1; సౌథీ 4-0-54-2; నరైన్ 4-0-40-1; వరుణ్ చక్రవర్తి 4-0-26-1; శార్దూల్ 4-0-43-0
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మన్‌దీప్ (సి) కరన్ (బి) అర్ష్‌దీప్ 2; రహ్మనుల్లా గుర్బాజ్ (బి) ఎలీస్ 22; అనుకుల్ రాయ్ (సి) రజా (బి) అర్ష్‌దీప్ 4; వెంకటేశ్ అయ్యర్ (సి) రాహుల్ చాహర్ (బి) అర్ష్‌దీప్ 34; నితీష్ రాణా (సి) రాహుల్ చాహర్ (బి) రజా 24; రింకు సింగ్ (సి) రజా (బి) రాహుల్ చాహర్ 4; రసెల్ (సి) రజా (బి) సామ్ కరన్ 35; శార్దూల్ నాటౌట్ 8; నరైన్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (16 ఓవర్లలో 7 వికెట్లకు) 146; వికెట్ల పతనం: 1-13, 2-17, 3-29, 4-75, 5-80, 6-130, 7-138; బౌలింగ్: సామ్ కరన్ 3-0-38-1; అర్ష్‌దీప్ సింగ్ 3-0-19-3; నాథన్ ఎలీస్ 3-0-27-1; సికందర్ రజా 3-0-27-1; రిషి ధావన్ 1-0-15-0; రాహుల్ చాహర్ 2-0-12-1; హర్‌ప్రీత్ బ్రార్ 1-0-7-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్