Virender Sehwag: ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్సీ పేలవంగా సాగిందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ధోని పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని సెహ్వాగ్ తెలిపాడు.
దిల్లీ: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్సీ పేలవంగా సాగిందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ధోని పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని సెహ్వాగ్ తెలిపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండేను ధోని ఉపయోగించిన విధానాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. ‘‘భారీగా పరుగులిచ్చిన తుషార్‌తో కాకుండా మొయిన్ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్ వేయించాల్సింది. ధోని తరుచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరు. కానీ కుడిచేతి వాటం బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాల్సింది’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో పాత బంతితో బౌలింగ్ చేసే తుషార్‌తో ఆరంభంలో ఓవర్లు వేయించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్