భారత్‌ నియంతలా వ్యవహరిస్తోంది: ఇమ్రాన్‌

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారత్‌పై, బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు. పాక్‌లో జరిగే ఆసియాకప్‌కు టీమ్‌ఇండియా వెళ్లకపోతే, భారత్‌ నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు పాకిస్థాన్‌ రాదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Updated : 02 Apr 2023 02:33 IST

కరాచి: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారత్‌పై, బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు. పాక్‌లో జరిగే ఆసియాకప్‌కు టీమ్‌ఇండియా వెళ్లకపోతే, భారత్‌ నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు పాకిస్థాన్‌ రాదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేలా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తుందనే వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌ మాజీ ప్రధాని కూడా అయిన ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌పై విమర్శలు గుప్పించాడు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు ఇలా ఉండడం దురదృష్టకరం. ప్రపంచ క్రికెట్లో సూపర్‌ పవర్‌గా ప్రవర్తిస్తున్న భారత్‌ ఎంతో అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. మరే దేశానికీ భారత్‌లా నిధులు సృష్టించే సామర్థ్యం లేకపోవడమే అందుకు కారణం. ఇప్పుడు ఏ జట్టుతో ఆడాలి, ఏ జట్టుతో ఆడకూడదు అనే విషయంలో భారత్‌ నియంతలా వ్యవహరిస్తోంది. పాక్‌ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించకపోవడం విచిత్రంగా అనిపిస్తోంది’’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని