టైటిల్ పోరుకు సింధు
పి.వి.సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈ తెలుగమ్మాయి స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సింధు 24-22, 22-20తో యెజియా మిన్ (సింగపూర్)ను ఓడించింది.
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
మాడ్రిడ్: పి.వి.సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈ తెలుగమ్మాయి స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సింధు 24-22, 22-20తో యెజియా మిన్ (సింగపూర్)ను ఓడించింది. ఈ పోరులో భారత స్టార్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో 15-20తో వెనుకబడిన స్థితిలో గొప్పగా పుంజుకున్న సింధు 5 వరుస పాయింట్లతో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత అదే జోరుతో గేమ్ గెలిచింది. రెండో గేమ్‌లోనూ నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. కానీ ఆరంభంలో 1-6తో వెనుకబడినా.. విరామ సమయానికి సింధు 11-6తో ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ తర్వాత మిన్ పుంజుకోవడంతో స్కోర్లు సమమవుతూ వెళ్లాయి. 20-20తో ఉన్న దశలో ఒత్తిడిని అధిగమించి వరుసగా రెండు పాయింట్లు దక్కించుకున్న సింధు.. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో ఆమెకిదే తొలి ఫైనల్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది