సంక్షిప్త సమాచారం
మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక డ్రా చేసుకున్నారు. అసుబయెవా (కజకిస్థాన్)తో హంపి 37 ఎత్తుల్లో పాయింట్లు పంచుకుంది. మరోవైపు సహచర గ్రాండ్‌మాస్టర్ వైశాలితో తలపడిన హారిక.. 42 ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించింది.
హంపి, హారిక గేమ్‌లు డ్రా
దిల్లీ: మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక డ్రా చేసుకున్నారు. అసుబయెవా (కజకిస్థాన్)తో హంపి 37 ఎత్తుల్లో పాయింట్లు పంచుకుంది. మరోవైపు సహచర గ్రాండ్‌మాస్టర్ వైశాలితో తలపడిన హారిక.. 42 ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించింది. హంపి (3 పాయింట్లు) అయిదు, హారిక (2) ఎనిమిది, వైశాలి (1.5) పది స్థానాల్లో కొనసాగుతున్నారు. అసుబయెవా (కజకిస్థాన్, 4.5) అగ్రస్థానంలో ఉంది.
ఐపీఎల్‌కు విలియమ్సన్ దూరం
అహ్మదాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఈ ఏడాదే ఆ జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ కేన్ విలియ్సమన్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సిక్సర్‌ను అడ్డుకునే క్రమంలో విలియమ్సన్ కుడి మోకాలికి గాయమైంది. గాయం తీవ్రంగా బాధించడంతో విలియమ్సన్ మైదానాన్ని వీడాడు. సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌లో డబుల్ సెంచరీ, శతకం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ సీజన్ మొత్తానికి దూరమవడం గుజరాత్‌కు షాకే. విలియమ్సన్‌ను మినీ వేలం పాటలో గుజరాత్ రూ.2 కోట్లకు కొనుక్కుంది.
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
మెల్బోర్న్: హ్యాట్రిక్ ఎఫ్1 ప్రపంచ టైటిల్‌పై కన్నేసిన రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అతను ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం అర్హత రౌండ్లో 1 నిమిషం 16.732 సెకన్ల టైమింగ్‌తో ఈ డచ్ రేసర్ అగ్రస్థానంలో నిలిచాడు. మెర్సిడెజ్ రేసర్లు జార్జ్ రసెల్ (1:16.968 ని), లూయిస్ హామిల్టన్ (1:17.104 ని) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ప్రధాన రేసు ఆదివారం జరుగుతుంది.
ఫిట్‌గానే రోహిత్, ఆర్చర్
బెంగళూరు: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ ఆర్చర్ వంద శాతం ఫిట్‌గా ఉన్నారని, ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆడతారని ఆ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశాడు. సీజన్‌కు ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్ల ఫొటో షూట్‌కు రోహిత్ దూరమయ్యాడు. అతనికి అనారోగ్యంగా ఉందని, ముంబయి తొలి మ్యాచ్‌కు దూరమవుతాడనే ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిని ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. ‘‘రోహిత్ ఫిట్‌గా ఉన్నాడు. గత రెండు రోజులు సాధన చేశాడు. మ్యాచ్ ఆడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు. ఆర్చర్ కూడా మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జట్టుతో చేరినప్పటి నుంచి అతని పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని బౌచర్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు