Ravindra Jadeja - classen: క్లాసెన్‌ క్షమాపణ చెప్పినా.. చూపులతో బెదరగొట్టిన జడేజా

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు జడేజా కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో ఉన్న అతణ్ని కెప్టెన్‌ ధోని శాంతింపజేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసిన మయాంక్‌ అగర్వాల్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు.

Updated : 22 Apr 2023 07:54 IST

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు జడేజా కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో ఉన్న అతణ్ని కెప్టెన్‌ ధోని శాంతింపజేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసిన మయాంక్‌ అగర్వాల్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. దీన్ని అందుకునే ప్రయత్నంలో జడేజాకు నాన్‌స్ట్రైకర్‌ క్లాసెన్‌ అడ్డుగా వచ్చాడు. ఒకరిని ఒకరు ఢీ కొనడంతో జడేజా క్యాచ్‌ పట్టలేకపోయాడు. వెంటనే క్లాసెన్‌ క్షమాపణ చెప్పినప్పటికీ జడేజా చూపులతో బెదరగొట్టాడు. నోటికీ పనిచెప్పాడు. అదే ఓవర్‌ అయిదో బంతికి స్టంపౌట్‌ రూపంలో మయాంక్‌ను ఔట్‌ చేసిన జడ్డూ.. మరోసారి క్లాసెన్‌పై నోరు పారేసుకున్నాడు. ధోని.. అతణ్ని శాంతింపజేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు