WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. రహానె ఎంపికలో ధోని పాత్ర!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆజింక్య రహానె ఎంపిక వెనుక టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 28 Apr 2023 08:44 IST

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆజింక్య రహానె ఎంపిక వెనుక టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఎంపికకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీని బీసీసీఐ సంప్రదించినట్లు సమాచారం. రహానె ఫామ్‌, ఆటతీరు గురించి ధోని నుంచి వివరాలు సేకరించినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. గాయాలతో శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ దూరమైన నేపథ్యంలో రహానె చేరిక భారత జట్టుకు కలిసొచ్చేదే. ఈ ఐపీఎల్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న రహానె 6 మ్యాచ్‌ల్లో 44 సగటు, 189 స్ట్రైక్‌రేటుతో, 224 పరుగులు సాధించాడు. అందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని