RR vs CSK: చెన్నైకి చెక్
చెన్నై జోరుకు బ్రేక్. హ్యాట్రిక్ విజయాల సూపర్‌కింగ్స్‌కు రాజస్థాన్ చెక్ పెట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాయల్స్.. ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో చెన్నైని మట్టికరిపిస్తూ తిరిగి గెలుపుబాట పట్టింది.
మెరిసిన జైస్వాల్, జంపా, అశ్విన్
సూపర్‌కింగ్స్‌పై రాజస్థాన్ విజయం
చెన్నై జోరుకు బ్రేక్. హ్యాట్రిక్ విజయాల సూపర్‌కింగ్స్‌కు రాజస్థాన్ చెక్ పెట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాయల్స్.. ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో చెన్నైని మట్టికరిపిస్తూ తిరిగి గెలుపుబాట పట్టింది. యశస్వి జైస్వాల్ మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు భారీ స్కోరును అందిస్తే.. అశ్విన్, జంపా స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశారు. దూబె మెరుపులు చెన్నైకి సరిపోలేదు. అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రాజస్థాన్.. ధోనీసేనను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.
జైపుర్: రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (77; 43 బంతుల్లో 8×4, 4×6) చెలరేగడంతో మొదట రాజస్థాన్ 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ఛేదనలో చెన్నై తడబడింది. 6 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. శివమ్ దూబె (52; 33 బంతుల్లో 2×4, 4×6), రుతురాజ్ (47; 29 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. ఆడమ్ జంపా (3/22), అశ్విన్ (2/35) తమ స్పిన్‌తో సూపర్‌కింగ్స్ పతనాన్ని శాసించారు.
దూబె అదరగొట్టినా..: భారీ లక్ష్య ఛేదనలో బలమైన ఆరంభం అవసరం కాగా.. అందుకు భిన్నంగా మొదలైంది చెన్నై ఇన్నింగ్స్. రుతురాజ్, కాన్వే (8) జాగ్రత్తగా ఆడడంతో మొదటి మూడు ఓవర్లలో 13 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత రుతురాజ్ జోరు పెంచి బ్యాట్ ఝుళిపించినా.. మరోవైపు కాన్వే ఔటయ్యాడు. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోరు 68/1 మాత్రమే. ఆ తర్వాత అశ్విన్, జంపా మాయతో ఆ జట్టు మరింత గతి తప్పింది. రుతురాజ్‌ను జంపా వెనక్కి పంపగా.. అశ్విన్ ఒకే ఓవర్లో (11వ) రహానె (15), రాయుడు (0)లను ఔట్ చేసి చెన్నైని చావు దెబ్బతీశాడు. 11 ఓవర్లలో 73/4తో చెన్నై గెలుపు కష్టమే అనిపించింది. కానీ రెచ్చిపోయి ఆడిన శివమ్ దూబె సిక్సర్ల మోతతో ఆ జట్టును కాస్త పోటీలోకి తీసుకొచ్చాడు. అతడికంటే ముందే మొయిన్ అలీ (23; 12 బంతుల్లో 2×4, 2×6) బాదుడు మొదలెట్టాడు. రాయల్స్‌కు కలవరం తప్పలేదు. కానీ 15వ ఓవర్లో అలీని జంపా ఔట్ చేశాడు. ఆ తర్వాత దూబె దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించినా.. అది సరిపోలేదు లక్ష్యం పెద్దదైపోయింది. చివరి మూడు ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన పరిస్థితి. జడేజా కూడా కాస్త బ్యాట్ ఝుళిపించినా.. చెన్నై సమీకరణం చివరి రెండు ఓవర్లలో 46కు మారడంతో రాయల్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. 19వ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేసిన హోల్డర్ కేవలం 9 పరుగులే ఇవ్వడంతో రాయల్స్ విజయం లాంఛనమే అయింది. కుల్‌దీప్ యాదవ్ (1/18), సందీప్ శర్మ (0/24) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు.
మెరిసిన జైస్వాల్: రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్. విధ్వంసక బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాన్నిచ్చిన అతడు.. జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. మధ్యలో రాయల్స్‌ను చెన్నై కట్టడి చేసినా.. చివర్లో మళ్లీ బ్యాటర్లు బ్యాట్ ఝుళిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఆరంభం అదిరిపోయింది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన ఓపెనర్ జైస్వాల్.. కళ్లు చెదిరే షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తొలి ఓవర్లోనే (ఆకాశ్ సింగ్) మూడు ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటి చెప్పిన అతడు.. ఆకాశ్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. జైస్వాల్ దెబ్బకు ఆకాశ్ రెండు ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు చక్కగా బ్యాటింగ్ చేసిన బట్లర్ (27).. జైస్వాల్‌కు సహకరించడంతో రాజస్థాన్ ఏడు ఓవర్లలో 75/0తో భారీ స్కోరుపై కన్నేసింది. జైస్వాల్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. కానీ చెన్నై బంతితో పుంజుకుంది. బౌండరీలను అరికట్టడం ద్వారా స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. 9వ ఓవర్లో బట్లర్‌ను జడేజా ఔట్ చేశాడు. శాంసన్ (17; 17 బంతుల్లో 1×4) ధాటిగా ఆడలేకపోగా .. జైస్వాల్ కూడా నెమ్మదించాడు. 13 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 125/1. పైగా 14వ ఓవర్లో శాంసన్, జైస్వాల్‌ను తుషార్ వెనక్కి పంపాడు. మరోవైపు విధ్వంసక వీరుడు హెట్‌మయర్ (8) కూడా విఫలం కావడంతో రాజస్థాన్ పెద్ద స్కోరు చేయలేదేమో అనిపించింది. 8 నుంచి 17 ఓవర్ల మధ్య ఆ జట్టు చేసింది 78 పరుగులు. కానీ ధ్రువ్ జురెల్ (34; 15 బంతుల్లో 3×4, 2×6), పడిక్కల్ (27 నాటౌట్; 13 బంతుల్లో 5×4) చెలరేగడంతో ఆఖరి మూడు ఓవర్లలో రాయల్స్ 49 పరుగులు రాబట్టింది. ఈ జంట అయిదో వికెట్‌కు 20 బంతుల్లోనే 48 పరుగులు జోడించింది. పతిరన 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు.
రాజస్థాన్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) రహానె (బి) తుషార్ 77; బట్లర్ (సి) దూబె (బి) జడేజా 27; సంజు శాంసన్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 17; హెట్‌మయర్ (బి) తీక్షణ 8; ధ్రువ్ జురెల్ రనౌట్ 34; పడిక్కల్ నాటౌట్ 27; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202;
వికెట్ల పతనం: 1-86, 2-125, 3-132, 4-146, 5-194;
బౌలింగ్: ఆకాశ్ సింగ్ 2-0-32-0; తుషార్ దేశ్‌పాండే 4-0-42-2; తీక్షణ 4-0-24-1; జడేజా 4-0-32-1; మొయిన్ అలీ 2-0-17-0; పతిరన 4-0-48-0
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పడిక్కల్ (బి) జంపా 47; కాన్వే (సి) సందీప్ శర్మ (బి) జంపా 8; రహానె (సి) బట్లర్ (బి) అశ్విన్ 15; శివమ్ దూబె (సి) బట్లర్ (బి) కుల్‌దీప్ యాదవ్ 52; రాయుడు (సి) హోల్డర్ (బి) అశ్విన్ 0; మొయిన్ అలీ (సి) శాంసన్ (బి) జంపా 23; జడేజా నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170;
వికెట్ల పతనం: 1-42, 2-69, 3-73, 4-73, 5-124, 6-170;
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-24-0; కుల్‌దీప్ యాదవ్ 3-0-18-1; హోల్డర్ 4-0-49-0; అశ్విన్ 4-0-35-2; అడమ్ జంపా 3-0-22-3; చాహల్ 2-0-21-0
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్