Sunil Gavaskar: సూర్య ఆడుతుంటే గల్లీ క్రికెట్‌ లాగే..: సునీల్‌ గావస్కర్‌

ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ చెలరేగి ఆడుతుంటే గల్లీ క్రికెట్‌ చూస్తున్నట్లే ఉందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. మంగళవారం రాత్రి బెంగళూరుపై రెచ్చిపోయి ఆడిన సూర్య కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.

Published : 11 May 2023 09:25 IST

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ చెలరేగి ఆడుతుంటే గల్లీ క్రికెట్‌ చూస్తున్నట్లే ఉందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. మంగళవారం రాత్రి బెంగళూరుపై రెచ్చిపోయి ఆడిన సూర్య కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. తనదైన శైలిలో 360 డిగ్రీ షాట్లు ఆడిన సూర్యపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘‘స్కై బౌలర్లతో ఆటాడుకుంటున్నాడు. తన బ్యాటింగ్‌ చూస్తుంటే గల్లీ క్రికెట్‌ ఆడుతున్నట్లే అనిపిస్తోంది. సాధన, శ్రమతో అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. తన కింది చేతిని అతను చక్కగా ఉపయోగిస్తాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో అతను లాంగాన్‌, లాంగాఫ్‌ సహా అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడాడు’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని