Virat Kohli: సచిన్‌ రికార్డు బద్దలు కొడితే..

సచిన్‌ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం తనకో భావోద్వేగ సందర్భం అవుతుందని విరాట్‌ కోహ్లి అన్నాడు.

Updated : 12 May 2023 07:20 IST

దిల్లీ: సచిన్‌ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం తనకో భావోద్వేగ సందర్భం అవుతుందని విరాట్‌ కోహ్లి అన్నాడు. 274 వన్డేలు ఆడిన కోహ్లి ఇప్పుడు 46 శతకాలతో ఉన్నాడు. సచిన్‌ రికార్డును అధిగమించడం గురించి అడిగినప్పుడు కోహ్లి స్పందిస్తూ.. ‘‘అది నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించే సందర్భమవుతుంది’’ అని అన్నాడు. జీవిత విలువలు, క్రమశిక్షణ, ప్రణాళిక గురించి క్రీడలు నేర్పిస్తాయని ఓ డాక్యుమెంటరీ సిరీస్‌లో కోహ్లి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని