2007లోలా ఈసారి టీ20 ప్రపంచకప్‌నకు: రవిశాస్త్రి

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చాలామంది కొత్త ముఖాలను చూస్తామని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

Published : 13 May 2023 04:05 IST

దిల్లీ: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చాలామంది కొత్త ముఖాలను చూస్తామని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచకప్‌ జట్టుపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ముద్ర ఉంటుందని అభిప్రాయపడ్డాడు. టెస్టు, వన్డే జట్ల సారథి రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీ20 ఫార్మాట్లో కొనసాగుతున్నా.. నిరుడు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి జట్టు కొత్త పంథాలో పయనిస్తోంది. గత కొంతకాలంగా టీ20 జట్టుకు హార్దిక్‌ సారథ్యం వహిస్తున్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ రాబోతుంది. కుర్రాళ్లలో చాలా ప్రతిభ ఉంది. ఈసారి ఐపీఎల్‌లో కొత్త ప్రతిభావంతుల్ని చూశాం. కొత్త జట్టు కాకపోవచ్చు. కానీ కొత్త ముఖాలు ఉంటాయి. ఇప్పటికే హార్దిక్‌ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ఫిట్‌గా ఉన్నంత వరకు సారథిగా కొనసాగుతాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ దారిలోనే ప్రతిభావంతుల్ని గుర్తిస్తారు. ఎంపికలో హార్దిక్‌ కీలకపాత్ర పోషిస్తాడు. అతని ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చాలామంది ఆటగాళ్లను చూసే ఉంటాడు. సహజంగానే ఆ కుర్రాళ్లను మైదానంలోకి తీసుకెళ్లేది అతనే. ఇంకెవరూ కాదు. కాబట్టి హార్దిక్‌ మాటకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే వన్డే ప్రపంచకప్‌ ముగిసే వరకు పొట్టి కప్పు గురించి ఆలోచించొద్దు. ఆ తర్వాత టీ20లకు కావాల్సినంత సమయం ఉంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని