అందుకే ధోని ఆఖర్లో బ్యాటింగ్‌కు..: హసి

మోకాలి గాయం నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఇంకా పూర్తిగా కోలుకోలేదని, గాయం తీవ్రత పెరగకూడదనే ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హసి చెప్పాడు.

Published : 20 May 2023 04:07 IST

దిల్లీ: మోకాలి గాయం నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఇంకా పూర్తిగా కోలుకోలేదని, గాయం తీవ్రత పెరగకూడదనే ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హసి చెప్పాడు. ‘‘ధోని ముందే బ్యాటింగ్‌కు వస్తే వేగంగా పరుగులు తీయాల్సి వస్తుంది. అతడి మోకాలు అందుకు సహకరించదు. ధోని వంద శాతం ఫిట్‌గా లేడు. ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాలన్నదే అతడి ప్రణాళిక’’ అని అన్నాడు. ఐపీఎల్‌కు ధోని వీడ్కోలు పలకడం గురించి మాట్లాడుతూ.. ఇంకో అయిదేళ్లు అతడు ఐపీఎల్‌లో ఆడగలడని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు