సింధు, ప్రణయ్‌లకు పరీక్ష

సుదిర్మన్‌ కప్‌లో నిరాశపరిచిన భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు మరో పరీక్షకు సిద్ధమయ్యారు.

Published : 23 May 2023 02:32 IST

మలేసియా మాస్టర్స్‌ నేటి నుంచే

కౌలాలంపూర్‌: సుదిర్మన్‌ కప్‌లో నిరాశపరిచిన భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు మరో పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభంకానున్న మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇటీవల సుదిర్మన్‌ కప్‌లో చైనీస్‌ తైపీ, మలేసియాలతో జరిగిన గ్రూపు దశ మ్యాచ్‌ల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల్లో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ మొదలవడంతో ప్రపంచ టూర్‌ టోర్నీలో భారత క్రీడాకారులు గాడినపడతారేమో చూడాలి. మలేసియా మాస్టర్స్‌లో ఆరో సీడ్‌గా బరిలో ఉన్న సింధు.. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో లైన్‌ క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడనుంది.  పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో ప్రణయ్‌, టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)తో కిదాంబి శ్రీకాంత్‌,  లో కీన్‌ యూ (సింగపూర్‌)తో లక్ష్యసేన్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు