శ్రీకర్‌ భరత్‌కే జట్టు ఓటు

ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో జట్టు వికెట్‌ కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌నే టీమ్‌ఇండియా ఎంపిక చేసుకుంటుందని మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

Published : 26 May 2023 01:50 IST

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో జట్టు వికెట్‌ కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌నే టీమ్‌ఇండియా ఎంపిక చేసుకుంటుందని మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఇషాన్‌ కిషన్‌ కంటే ఇటీవల బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో వికెట్‌ కీపింగ్‌ చేసిన భరత్‌ వైపే టీమ్‌ఇండియా మొగ్గుచూపుతుందని భావిస్తున్నట్లు రవిశాస్త్రి తెలిపాడు. ‘‘భరత్‌ లేదా ఇషాన్‌లలో ఎవరు మెరుగైన కీపర్‌ అన్నది చూడాలి. ఆసీస్‌తో సిరీస్‌లో భరత్‌కు అవకాశం లభించింది. అతను అన్ని మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి భరత్‌ స్పష్టమైన ఎంపిక అని అనుకుంటున్నా. కీపర్‌ ఎంపికపై ఓవల్‌ మైదానంలోని పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. ఇద్దరు స్పిన్నర్లు ఆడుతుంటే భరత్‌ ఉండాలని కోరుకుంటారు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు భరత్‌ నాలుగు టెస్టులాడగా.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇషాన్‌ అరంగేట్రం చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని