ఒకే పార్శ్వంలో జకో, అల్కరాస్‌

సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్లో ఒకే పార్శ్వంలో ఆడనున్నారు. ఈనెల 28న ఆరంభం కానున్న ఈ టోర్నీ సింగిల్స్‌ మెయిన్‌ డ్రా గురువారం విడుదలైంది.

Published : 26 May 2023 01:50 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ డ్రా విడుదల

పారిస్‌: సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్లో ఒకే పార్శ్వంలో ఆడనున్నారు. ఈనెల 28న ఆరంభం కానున్న ఈ టోర్నీ సింగిల్స్‌ మెయిన్‌ డ్రా గురువారం విడుదలైంది. టైటిల్‌కు గట్టిపోటీదారు అల్కరాస్‌కు నంబర్‌వన్‌ సీడింగ్‌ దక్కగా.. మాజీ ఛాంపియన్‌ జకోవిచ్‌ మూడో సీడ్‌గా ఆడనున్నాడు. వీళ్లిద్దరూ సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో నాలుగు టైటిళ్లు గెలిచి జోరు మీదున్న అల్కరాస్‌ను క్లే కోర్టులో అడ్డుకోవడం పెద్దగా ఫామ్‌లో లేని జకోకు అంత తేలికేం కాదు. 14సార్లు ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ గాయంతో ఆడకపోవడంతో నొవాక్‌, కార్లోస్‌ టైటిల్‌ ఫేవరెట్లుగా ఉన్నారు. తొలి రౌండ్లో కొవాసెవిచ్‌ (అమెరికా)తో జకో.. క్వాలిఫయర్‌తో అల్కరాస్‌ తలపడతారు. మరోవైపు రష్యా స్టార్‌ మెద్వెదెవ్‌ రెండో సీడ్‌గా పోటీలో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌)కు టాప్‌ సీడింగ్‌ దక్కింది. తొలి రౌండ్లో క్రిస్టీనా (స్పెయిన్‌)తో ఆడనున్న స్వైటెక్‌కు క్వార్టర్‌ఫైనల్‌ వరకు గట్టిపోటీ ఇచ్చే ప్రత్యర్థి కనిపించట్లేదు. క్వార్టర్స్‌లో కొకో గాఫ్‌ (అమెరికా) ఎదురయ్యే అవకాశం ఉంది. సబలెంక (బెలారస్‌), పెగులా (అమెరికా), రిబకినా (రష్యా), గార్సియా (ఫ్రాన్స్‌) 2, 3, 4, 5 సీడ్లుగా బరిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు